వెనుకబాటుతనాన్ని రూపుమాపేందుకే విశాఖ రాజధాని

వైయ‌స్ఆర్‌సీపీ ఉమ్మ‌డి విశాఖ‌ కో-ఆర్డినేట‌ర్ వైవీ సుబ్బారెడ్డి

విశాఖ‌: ఉత్త‌రాంధ్ర‌ వెనుకబాటుతనాన్ని రూపుమాపేందుకే విశాఖ పరిపాలన రాజధాని చేయాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిర్ణ‌యం తీసుకున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఉమ్మ‌డి విశాఖ కో-ఆర్డినేట‌ర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. విశాఖ గర్జన భయంతో ఇప్పుడు టీడీపీ- జనసేనకు ఉత్తరాంధ్ర గుర్తుకు వచ్చింది. విశాఖ గర్జన విజయవంతమైంద‌ని, విశాఖ రాజధాని అవకాశాన్ని వదులుకునే పరిస్థితుల్లో ప్రజలు లేర‌న్నారు. సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞతతో ఒక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ పరిపాల రాజధానిగా ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. విశాఖ గర్జనకు విశేషమైన స్పందన లభిస్తోంద‌ని చెప్పారు. పాదయాత్ర పేరుతో దండయాత్ర చేస్తున్న వారికి కనువిప్పు కలగాలని విశాఖ గర్జన ర్యాలీ చేప‌ట్టామ‌న్నారు. వర్షం కంటే ఉత్తరాంధ్ర ప్రజల ఆత్మస్థైర్యం గొప్పద‌న్నారు. ఉత్తరాంధ్రకు టిడిపి నాయకులు ఏం చేశారో సమాధానం చెప్పాల‌ని నిల‌దీశారు. 

తాజా వీడియోలు

Back to Top