వైయ‌స్ఆర్‌సీపీ మేనిఫెస్టోపై ఎల్లో బ్యాచ్ దుష్ప్ర‌చారం

 వైయ‌స్ఆర్‌సీపీ గ్రీవెన్స్ సెల్ ఛైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి   

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌ వైయస్ జగన్ మోహ‌న్ రెడ్డిఇ ప్రకటించిన మేనిఫెస్టోపై  రామోజీతో పాటు పచ్చమీడియా, టిడిపి నేతలు దుష్ప్రచారం చేస్తున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ గ్రీవెన్స్ సెల్ ఛైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి  మండిప‌డ్డారు. పేద, మధ్యతరగతి ప్రజలకు మేలు చేకూరేలా మేనిఫెస్టో ఉందని ప్రజలే చెప్తుంటే పచ్చమీడియాకు కనపడటం లేదా?  అని ప్ర‌శ్నించారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

  • - మద్యనిషేధం పై కూడా అసత్యాలతో వార్తలు వండివారుస్తున్నారు
  • - 42 వేల మద్యం బెల్టుషాపులను వైయస్ జగన్ పూర్తిగా నిర్మూలించారు
  • - చంద్రబాబు హయాంలో మద్యం ఏరులై పారించిన సంగతిని జనం మర్చిపోలేదు.
  • - ఎన్టీఆర్ విధించిన మద్యనిషేధానికి తూట్లు పొడిచింది చంద్రబాబు కాదా.
  • - చంద్రబాబు హయాంలో ఒక్క సెంటు భూమినైనా పేదలకు ఇచ్చారా
  • - వైయస్ జగన్ ఇప్పటికే దేశంలో ఎక్కడాలేని విధంగా  32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు
  • - 22 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతుంటే పచ్చమీడియాకి కనపడటం లేదా 
  • - 2.31 లక్షల ఉద్యోగాలు వైయస్ జగన్ కల్పించారు.ఇంకా లక్షలాది ఉద్యోగాలలో అవుట్ సోర్సింగ్,కాంట్రాక్ట్ ఉద్యోగులుగా నియమించారు
  • - చంద్రబాబులాగా హైటెక్ సిటీ కట్టానంటూ బోగస్ మాటలు మా పార్టీ నేతలు చెప్పటంలేదు
  • - నిరుద్యోగ భృతి ఇస్తానని నిరుద్యోగులను మోసం చేసింది చంద్రబాబు కాదా 
  • - చంద్రబాబు హయాంలో పరిశ్రమలు వచ్చి ఉంటే నిరుద్యోగభృతితో పనేంది.
  • - రైతులు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ పేరుతో మోసం చెసింది చంద్రబాబు కాదా..
  • - వీటనిపై చర్చించే దమ్ముగాని ,పచ్చమీడియా పత్రికలలో ప్రచురించి ధైర్యంగాని ఉన్నాయా. 
  • - చంద్రబాబు మేనిఫెస్టో కనపడకుండా చేస్తే, వైయస్ జగన్ ప్రతి ఇంట్లోనూ తన మేనిఫెస్టోని అందుబాటులో ఉంచారు.
  • -చంద్రబాబు మోసపు బుద్దిని జగన్ గారి విశ్వసనీయతను గ్రహించారు కాబట్టే ప్రజలు తిరిగి వైయస్సార్ సిపికి పట్టం గట్టబోతున్నారు.
Back to Top