గుంటూరు రేంజ్ ఐజీ, అనంతపురం ఏఎస్పీపై వైయ‌స్ఆర్ సీపీ ఫిర్యాదు

సచివాలయం: గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠిని బ‌దిలీ చేయాల‌ని, అనంతపురం ఏఎస్పీ రామకృష్ణను వెంట‌నే సస్పెండ్ చేయాలని కోరుతూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేశారు. వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణమూర్తి స‌చివాల‌యంలో ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి ముకేష్ కుమార్ మీనాను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠిని బదిలీ చేయాలని కోరారు. ఎన్నిక‌ల పోలింగ్ రోజున మాచర్ల, సత్తెనపల్లి, గురజాల, నరసారావుపేట, కొత్తగణేషునిపాడులో ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాల ఇళ్లలోకి చొరబడి టీడీపీ శ్రేణులు దౌర్జన్యాలు చేశారని, టీడీపీ దౌర్జాన్యాలు, అరాచకాలకు త్రిపాఠి వత్తాసు పలికారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

అదే విధంగా అనంతపురం అదనపు ఎస్పీ రామకృష్ణచౌదరి సస్పెండ్ చేయాలని ఈసీని కోరారు. ఎమ్మెల్యే  కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో సీసీ టీవీ కెమెరాలను ధ్వంసం చేయడం, పోలీసుల దౌర్జన్యంపై ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి ఆధారాలను అందించారు. ఇందుకు బాధ్యులైన రామకృష్ణను సస్పెండ్ చేయాలని కోరారు.

Back to Top