విజయంపై మేం ఫుల్‌ కాన్ఫిడెన్స్‌గా ఉన్నాం

గతం కంటే ఈసారి ఎక్కువ సీట్లే గెలుస్తాం

చంద్రబాబుకు ఆయన మీద ఆయనకే నమ్మకం లేదు

ప్రజలంతా సీఎం వైయస్‌ జగన్‌ మాటలను విశ్వసించారు, ఆయనతో నిలబడ్డారు

జనంపై సీఎం పెట్టుకున్న నమ్మకం జూన్‌ 4న క్రిస్టల్‌ క్లియర్‌గా కనిపిస్తుంది

తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై పోలీసుల దాడి అన్యాయం

పోలింగ్‌ తరువాత ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై టీడీపీ ఎందుకు మాట్లాడటం లేదు..?

వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూటి ప్ర‌శ్న‌

తాడేపల్లి: ఎన్నికల్లో విజయంపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఫుల్‌ కాన్ఫిడెన్స్‌తో ఉందని, గతం కంటే ఈ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుస్తామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సీఎం వైయస్‌ జగన్‌ మీద అంత వ్యతిరేకత పెంచుకున్న చంద్రబాబు కూటమిలో ఆ కాన్ఫిడెన్స్‌ ఎక్కడా కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఆయన మీద ఆయనకే నమ్మకం లేదన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే..

‘‘చంద్రబాబుకు ఆయన అజెండా మీద నమ్మకం లేదు. ఆయన సూపర్‌ సిక్స్‌ గురించి కూడా ప్రచారం చేసుకోలేదు. ఎంతసేపూ జగన్‌మోహన్‌రెడ్డి మీద వ్యక్తిగతంగా దాడులు లేదా వివేకానందరెడ్డి హత్య కేసు, కుటుంబం గురించి మాట్లాడటం, చివర్లో ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ అని దుష్ప్రచారం చేశారు. అసెంబ్లీలో ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను సపోర్టు చేశారు. ఆయన ఇచ్చిన హామీలను ప్రజలకు వివరించలేకపోయాడు. ఎందుకంటే ఆ హామీలను అమలు చేస్తాడనే నమ్మకం జనానికి లేదనే చంద్రబాబుకూ అవగాహన ఉంది కాబట్టే కేవలం వైయస్‌ఆర్‌సీపీని, సీఎం వైయస్‌ జగన్‌ను వ్యక్తిగతంగా దూషిస్తూనే ఎన్నికల ప్రచారం పూర్తి చేశారు. 

మా నాయకుడు వైయస్‌ జగన్‌ ఐదేళ్ల పాటు తాను రాష్ట్ర అభివృద్ధికి చేసిన కృషిని, అందించిన సంక్షేమ పథకాలు, సుపరిపాలన గురించి ప్రజలకు వివరించారు. సంక్షేమ పథకాలు, సంస్కరణలు కొనసాగాలంటే తనను దీవించండి అని సీఎం వైయస్‌ జగన్‌ ప్రజలను కోరారు. వివిధ పథకాల ద్వారా లబ్ధిపొందిన 87 శాతం లబ్ధిదారులు సీఎం మాటలను విశ్వసించారు. సంక్షేమ పథకాలు కంటిన్యూ అయితే మా బతుకుల్లో వెలుగు పెరుగుతుందని నమ్మారు. ప్రజలు సీఎం వైయస్‌ జగన్‌ను సొంత కుటుంబ సభ్యుడిలా భావిస్తున్నారు. ఎన్నికల్లో విజయంపై మేం ఫుల్‌ కాన్ఫిడెన్స్‌గా ఉన్నాం. 

టీడీపీ గెలుపుపై వాళ్ల నుంచి ఒక వ్యాలిడ్‌ రీజన్‌ లేదు. చంద్రబాబు చూస్తే అందరికీ అర్థం అవుతుంది. మామూలుగా అయితే రెండు వేళ్లు చూపించేవారు.. కానీ, టీడీపీ అధికారంలోకి వస్తుందని ఆయన మీద ఆయనకే నమ్మకం లేదు. జూన్‌ 4న కౌంటింగ్‌ రోజు స్పష్టమైన తీర్పు గమనించబోతున్నాం. జనం కోసం తపించే నాయకుడిని ప్రజలు అభిమానిస్తారు, ఆదరిస్తారు, అక్కున చేర్చుకుంటారనే నమ్మకం ఈ ఎన్నికల్లో కలుగుతుందని మేం భావిస్తున్నాం. 

ఎస్పీలు, కలెక్టర్లను ఈసీ బదిలీలు చేసినప్పుడు ఈనాడులో ఈడ్చిపాడేసిన ఈసీ అని పెద్ద బ్యానర్‌ హెడ్డింగ్‌ పెట్టి రాశారు. ఆరోజు నుంచే చెబుతున్నాం.. పురందేశ్వరి, ఇంకెవరైనా మాకు ఇలాంటి కంప్లయింట్స్‌ ఉన్నాయని ప్రతిపక్షాలు రాయడంలో తప్పేం లేదు. కానీ, ఎవరిని నియమించాలో కూడా వాళ్లే సూచించారు. ఎప్పుడైతే కూటమి ఏర్పడిందో అప్పుడే చంద్రబాబుకు కేంద్రం నుంచి ఫ్రీ హ్యాండ్‌ ఇచ్చారేమో అని అనిపిస్తుంది. ఆ మేరకు ఒత్తిళ్లు పనిచేశాయనడానికి బలమైన కారణం హడావుడిగా పెద్ద సంఖ్యలో అధికారులను మార్చడం. 

రాష్ట్రంపై పట్టులేనివారిని తీసుకువస్తే కష్టం అని ఆరోజునే చెప్పాం. ఆఖరకు పోలింగ్, పోలింగ్‌ తరువాతి రోజు జరిగిన హింస చూస్తే మేం చెప్పిన మాట ఎంత కరెక్టో అర్థం అవుతుంది. రకరకాల కారణాలను చూపించి అధికారులను మార్పించారో అక్కడే హింస జరగడం అంటే టీడీపీ కుట్ర పూరితంగా ప్లాన్, పథకం ప్రకారం పురందేశ్వరి, సెంట్రల్‌లోని బీజేపీ లీడర్ల సాయంతో అందరినీ తప్పించిందని అర్థం అవుతుంది. 

నిన్న ఎన్నికల కమిషన్‌ పరిశీలన చేసి కరెక్ట్‌ చేసుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. అడ్డగోలుగా ఎలాంటి ఆలోచన చేయకుండా వారు చెప్పిన అధికారులను నియమించడం ఏంటి.. వాళ్లంతా ప్రతిపక్ష పార్టీలకు ఏజెంట్లుగా ఎందుకు కాకూడదనే ఆలోచన ఈసీకి అప్పుడే వచ్చి ఉండాలి. అలా ఆలోచిస్తే ఇంత హింసాత్మక ఘటనలు జరిగేవి కాదు. 

ఆరోజు ఉన్న అధికారులను తప్పించి కొత్తవారిని తెచ్చుకున్నారంటే.. ఈసీ నియమించిన వారి ఉండగా హింస జరగడం అంటే ఈసీ ఫెయిల్యూర్, టీడీపీ కుట్రపూరితంగా చేసిందని ప్రజలకు అర్థం అవుతుంది. ఈ నేపథ్యంలో మళ్లీ అధికారులపై వేటు అని పత్రికల్లో దాన్ని ఉపయోగించుకొని బ్యానర్లు పెట్టడం ఆశ్చర్యంగా ఉంది. 

వైయస్‌ఆర్‌సీపీ మళ్లీ మళ్లీ చెబుతుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రజలతో మమేకమై, ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేసి తద్వారా ఆశీస్సులు తీసుకొని మళ్లీ పాలనలో కొనసాగాలని కోరుకుంటాం తప్ప.. అడ్డగోలుగా వ్యవస్థల్లో దూరి ఎవరో నలుగురు ఎస్పీలను, ముగ్గురు కలెక్టర్లను పెట్టుకొని వారి ద్వారా ఎన్నికలు మేనేజ్‌ చేయాలనుకోవడం దుర్మార్గం. 

ఈ–ఆఫీస్‌ అప్‌గ్రేడ్‌ చేయొద్దు అని, పథకాలు ఆపేసి కాంట్రాక్టర్లకు బిల్లులు పే చేస్తున్నారని రాస్తున్నారు. అసలు చంద్రబాబు అధికారంలోకి వచ్చేశానని అనుకుంటున్నాడా..? అర్థం కావడం లేదు. స్టేట్‌ గవర్నమెంట్‌ అంటే పంచాయతీ ఆఫీసా..? ఈ–ఆఫీస్‌ అప్‌గ్రేడ్‌ చేయొద్దు అంటే చంద్రబాబు అధికారంలోకి వచ్చేస్తున్నట్లుగా ఇంప్రేషన్‌ ఇస్తూ స్టేట్‌మెంట్స్‌ ఇవ్వడం, గవర్నర్‌కు లేఖ రాయడం చూస్తే చంద్రబాబు ధోరణి ఇంకా మారలేదనేది అర్థం అవుతుంది. 

తాడిపత్రిలో పెద్దారెడ్డి ఇంటిపై జరిగింది అన్యాయం. కావాల్సిన అధికారులను నియమించుకొని దౌర్జన్యానికి దిగి, హింసాకాండ క్రియేట్‌ దాంట్లో నుంచి లాభం పొందాలని టీడీపీ కుట్ర చేసింది. సీసీ కెమెరాలు ఉండేది నేరస్తులను పట్టుకోవడానికి, వాటిని పోలీసులు ధ్వంసం చేయడం కంటే ఘోరం మరొకటి ఉంటుందా..? దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తున్నాం. ఎన్నికల పోలింగ్‌ నుంచి జరుగుతున్న ఘటనలు చూస్తే.. టార్గెటెడ్‌గా తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిషన్‌లో లొసుగులను ఆసరా చేసుకొని, అక్కడున్న కొంతమంది వ్యక్తులను పట్టుకొని అడ్డగోలుగా ప్రవర్తించింది. లాస్ట్‌ స్టేజ్‌లో కూడా టీడీపీకి, ఆ పార్టీ లీడర్‌ చంద్రబాబుకు బుద్ధి వచ్చినట్టు లేదనేది అర్థం అవుతుంది. 

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌కు గతంలో టీడీపీ సపోర్టు చేసింది. ఎన్నికల చివరి దశలో ఆ యాక్ట్‌పై దుష్ప్రచారం చేసింది. పోలింగ్‌ తరువాత దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదు. కూటమి ఇచ్చిన హామీల మీద వాళ్లకు నమ్మకం లేదు, టీడీపీని ప్రజలు నమ్ముతున్నారనే నమ్మకం కూడా ఆ పార్టీకి లేదు. బెదిరించడం, భయపెట్టడం ద్వారా ఏదో చేయాలని చూశారు. నెగిటివ్‌ ప్రచారంలో వాళ్లే కొట్టుకుపోయారనేది పోలింగ్‌ చూస్తే అర్థం అవుతుంది. నీతి ఆయోగ్‌ కూడా ల్యాండ్‌ టైటిలింగ్‌ను సపోర్టు చేస్తున్నామని క్లారిటీ ఇచ్చింది. 
 

Back to Top