ఓట‌మి భ‌యంతోనే టీడీపీ దాడులు

గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి ర‌మేష్ 

కృష్ణా: ఓట‌మి భ‌యంతోనే చంద్ర‌బాబు నాయుడు దాడులు చేయిస్తున్నాడని, టీడీపీకి ఓటు వేయ‌లేద‌న్న అక్క‌సుతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల‌పై దాడుల‌కు తెగ‌బ‌డుతున్నాడ‌ని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి ర‌మేష్ మండిప‌డ్డారు. పోలింగ్, ఆ త‌రువాతి రోజు టీడీపీ నేత‌లు చేసిన అరాచ‌క‌ దాడుల‌పై గ‌వ‌ర్న‌ర్‌, ఈసీ, డీజీపీల‌కు ఫిర్యాదు చేశామ‌న్నారు. మంత్రి జోగి ర‌మేష్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్ర‌బాబుకు ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంద‌న్నారు. జూన్ 4వ తేదీన టీడీపీ అడ్ర‌స్ గ‌ల్లంత‌వ్వ‌డం ఖాయ‌మ‌న్నారు. ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన త‌రువాత  చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రం విడిచి పారిపోతాడని ఎద్దేవా చేశారు. 

Back to Top