ఎన్నికలు రద్దు చేస్తే ఎవరైనా సంతోషిస్తారా? 

వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

పరిషత్‌ ఎన్నికలపై హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ తీర్పు దురదృష్టకరంl

కోర్టు తీర్పుతో ప్రజలు కూడా దిగ్భ్రాంతి చెందారు

టీడీపీ దుర్మార్గపు ఎత్తుగడలు వేస్తుంది

ఎన్నికలు ఎప్పుడు జరిపినా వైయస్‌ఆర్‌సీపీకే పట్టం కడతారు

సీఎం వైయస్‌ జగన్‌ పాలనతో ప్రజలు సంతోషంగా ఉన్నారు

ప్రజలు వైయస్‌ఆర్‌సీపీ వైపే ఉన్నారు

దేవుడు టీడీపీ నేతలకు వివేకాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాం

రఘురామకృష్ణరాజు ఏం మాట్లాడారో అందరికీ తెలుసు

సీఐడీ కేసులో అభ్యంతరాలు ఏమీ లేవని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది

తాడేపల్లి: ఎన్నికలు రద్దు చేస్తే ఎవరైనా సంతోషిస్తారా అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. టీడీపీ దివాళాకోరుతనం మరోసారి బయటపడిందని విమర్శించారు.  పరిషత్‌ ఎన్నికలపై హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ తీర్పు దురదృష్టకరమన్నారు. ఎన్నికలు ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమని గుర్తు చేశారు.  పరిషత్‌ ఎన్నికలు గతేడాది కరోనాతో వాయిదా పడ్డాయని, ఎన్నికలు జరపమని గతంలో డివిజన్‌ బెంచే చెప్పిందని గుర్తు చేశారు. కోవిడ్‌ క్లిష్టపరిస్థితుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేశామన్నారు. కోర్టు తీర్పుతో ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారని చెప్పారు. ప్రజాక్షేత్రంలో గెలవలేమని ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు.ప్రతిసారి ఏదో ఒక సాకుతో ఎన్నికలు అడ్డుకునే ప్రయత్నం చేశారని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు జరిపినా వైయస్‌ఆర్‌సీపీకే పట్టం కడతారని, ప్రజల దీవెనలు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి మెండుగా ఉన్నాయని, రోజు రోజుకు ఆయనపై ఆదరణ పెరుగుతుందన్నారు. టీడీపీ తీరు జుగుప్సాకరంగా ఉందని తప్పుపట్టారు. రఘురామకృష్ణరాజు అరెస్టు వ్యవహారం, సీఐడీ కేసులో అభ్యంతరాలు ఏమీ లేవని సుప్రీం కోర్టు అభిప్రాయపడిందని భావిస్తున్నట్లు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో అతి ముఖ్యమైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. కోవిడ్‌ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో అతి తక్కువ సమయంలో  పరిషత్‌ ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. దీనికంటే వెనుక ఉన్న మున్సిపల్‌ ఎన్నికలు పూర్తి అయ్యాయి. ఏడాది తరువాత మళ్లీ ఎన్నికలు జరిగితే వాటిని రద్దు చేసి, సుప్రీం కోర్టు ఆదేశాలు పాటించలేదని సింగిల్‌ బెంచ్‌ తీర్పు ఇవ్వడం దురదృష్టకరం. పరిపాలనలో అత్యంత ముఖ్యమైన లేయర్‌ స్థంభించిపోవడానికి, ప్రజల అభిష్టం ప్రతిభింబించకుండా గండికొట్టినట్లు అయ్యింది. ఎన్నికలు రద్దు చేస్తూ సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పు ఇది ఇబ్బందికరం.

ఇప్పుడున్న కోవిడ్‌ నేపథ్యంలో కీలకమైన ప్రజాస్వామ్యానికి ప్రాణాధారమైన ఈ ఎన్నికలు రద్దు చేయడం బాధాకరం. ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన ఓటర్లు ఓ యజ్ఞంలా పూర్తి చేసిన ప్రక్రియను గుర్తించకుండా ఈ తీర్పు వచ్చింది. 

గతంలో ఇదే సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై హైకోర్టులో విచారణ జరిపి ఎన్నికలు నిర్వహించమని ఆదేశించింది. ఎన్నికల పోలింగ్‌ జరపాలని హైకోర్టు ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాలు, అనుమతి ప్రకారమే జరిగిన ప్రక్రియ ఇది అన్నది మరచిపోలేదు. విచారణ చేసినా కూడా ఈ అంశాన్ని గుర్తించుకోవాలి.
నేను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున నా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఇందులో పిటిషనర్‌గా ప్రభుత్వం తరఫున ఉన్నారు. మరోవైపు టీడీపీ, జనసేన వ్యక్తులు ఉన్నారు. ఇందులో రాజకీయ అంశాలు ముడిపడి ఉన్నాయి. సాంకేతికంగా ఏదైనా అధారాలు ఉంటే వాటి ప్రకారం విచారణ చేసి ఉంటే బాగుండు. గతంలో ఎన్నికల కమిషనర్‌గా ఉన్న నిమ్మగడ్డ ఎన్నికలు నిర్వహించకుండా ప్రతిపక్షాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించారు. కరోనా అంటూ ఆ రోజు ఎన్నికలు వాయిదా వేశారు. మరోసారి కరోనా ఉన్న సమయంలో ఎన్నికలు అంటూ ముందుకు వచ్చారు. ప్రజాస్వామ్యంలో వైయస్‌ఆర్‌సీపీపై గెలువలేమని, ఏదోఒక విధంగా దొంగదెబ్బ కొట్టాలని ప్రతిపక్షాలు కుట్ర చేశాయి. చిల్లర ఎత్తుగడలతో ఇలాంటి ప్రయత్నాలు చేసినట్లుగా కనిపిస్తుంది.

చెంపపెట్టు అన్న మాట అనాలంటే ఇక్కడ ప్రజాస్వామ్య ప్రక్రియకు ఆటంకం కలిగింది. దీన్ని చూసి ఆనందిస్తే అది తప్పు. ప్రజలు ఓట్లు వేసింది వాస్తవం, బ్యాలెట్‌ బాక్స్‌ల్లో ఫలితాలు ఉన్నాయి. దాన్ని ఆపడం చెంపపెట్టు అంటే చేతులెత్తి దండం పెట్టడమే. గతంలో కూడా ఎన్నోమార్లు చెప్పాం. ఎన్నికలు ఎప్పుడు జరిపినా వైయస్‌ జగన్‌ చేస్తున్న బ్రహ్మండమైన మంచి పనులతో మా పార్టీకి ప్రజల దీవెనలు పెరుగుతాయి. 

 చిన్న పిల్లల చేష్టాలుగా టీడీపీ దుర్మార్గపు కుట్రగా, ఎత్తుగడగా భావిస్తున్నాం. ఆ పార్టీకి ప్రజల దీవెన లేదు కాబట్టే..ఎన్నికలు రద్దు అయితే సంతోషిస్తున్నారు. ఇది జుగుప్సాకరంగా ఉంది. ప్రజా తీర్పు ఫైనల్‌గా భావించే పార్టీలకు ప్రజాస్వామ్యంపై విలువ ఉంటుంది. ప్రజాస్వామ్య ప్రక్రియకు ఆటంకం కలిగితే సంబరాలు చేసుకోవడం జుగుప్సాకరంగా ఉంది. ప్రతి రోజు లేనిపోని ఆరోపణలు చేయడం, కట్టుకథలు చెప్పడం, ఇలాంటి తీర్పులు వస్తే సంబరాలు చేసుకోవడం విచారకరం. రూలింగ్‌ పార్టీగా, రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా, కోట్లాది మంది అభిమానించే పార్టీగా ఈ తీర్పు అన్యాయంగా భావిస్తోంది. ఇంత మంది రిస్క్‌ చేసి , కోవిడ్‌ సమయంలో అతిజాగ్రత్తగా కీలకమైన ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసినందుకు సంతోషించాలి. అభినందించాలి. ఈ కష్టకాలంలో ఏది ఆగకూడదు. ప్రస్తుత పరిస్థితుల్లో సజావుగా ఎన్నికలు నిర్వహించడం శుభపరిణామం. అలాంటి ఎన్నికలు రద్దు చేయడం సరికాదు.

నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ హైకోర్టు తీర్పు ప్రకారమే ఎన్నికలు నిర్వహించారు కదా? ఇలాంటి సమయంలో ఈ తీర్పు బాధాకరం. కొన్ని శక్తుల కుట్రలు తప్ప మరేవి లేవు.  చంద్రబాబు ఈ జన్మకు ఒక వివేకవంతమైన ఆలోచనలు చేయలేరు. ఎక్కడ ఇబ్బంది పెట్టవచ్చు అన్న ఆలోచనతో ఉన్నారు. ఏది ఏమైనా ప్రజలు మా పార్టీ వైపు ఉన్నారు. ఈ తీర్పును చూసి రాష్ట్రప్రజలంతా దిగ్భ్రాంతి చెందారు. ఈ తీర్పుపై న్యాయపోరాటం చేస్తాం. న్యాయమే నిలబడుతుంది. ఇంత భారీ ఎత్తుక కష్టపడి రీస్క్‌ తీసుకొని నిర్వహించిన ఎన్నికలకు ఆటంకం జరగకూడదు. కరోనా సమయంలో నిర్వహించిన ఎన్నికల్లో ఓట్లు వేసిన ప్రజలు తమ తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు. అవసానదశలో ఉన్న పార్టీ నేతలు ప్రజలు ఛీదరించుకుంటారన్నది గుర్తించుకోవాలి.

ఎంపీ రఘురామకృష్ణరాజు కు సంబంధించి వారం రోజులుగా జరుగుతున్న హైడ్రామా..సీఐడీ పెట్టిన కేసు, ఆయన కాలికి గాయమైందా? లేదా అన్నదానిపై సుప్రీం కోర్టు అభ్యంతరాలు ఏమీ లేవని అభిప్రాయపడిందని భావిస్తున్నాం. ఆయన మాట్లాడిన మాటలు, ఆయన చేసిన దుష్ప్రచారంపై 124బీ కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టుకు వెళ్లిన తరువాత అనుమతించడం, సీఐడీ చర్యలు అభ్యంతరం కాదని అత్యున్నత న్యాయ స్థానం భావించింది. హదు ్దపద్దు లేకుండా చేస్తున్న కామెంట్లు ఇకనైనా మానుకోవాలి. మా ప్రభుత్వానికి సంబంధించినంత వరకు రాజకీయాలకు అతీతంగా, ప్రజల మంచి కోరి పాలన సాగుతోంది. వైయస్‌ జగన్‌ ఎవరిని ప్రత్యర్థులు, శత్రువులు అని అనుకోవడం లేదు. రెండేళ్ల పాలనలో వైయస్‌ జగన్‌ ప్రతిపక్షాల కుట్రలను పట్టించుకోకుండా ప్రజల బాగోగుల గురించి మాత్రమే ఆలోచన చేస్తున్నారు. కక్షసాధింపు చర్యలు ఏవీ ఇంతవరకు జరగలేదు. ప్రతిపక్ష నేతలు చేసిన తప్పులను బట్టే వారికి ఇప్పటి వరకు శిక్షలు పడ్డాయి. సాక్ష్యాధారలతో టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ధూళిపాళ్ల నరేంద్రలను అరెస్టు చేశారు. వాళ్ల అరెస్టు గురించి మోకాళ్లకు బట్టతలకు ముడేశారు. వైయస్‌ జగన్‌పై వారు చేస్తున్నది ఆరోపణలే తప్ప..ఇందులో నిజం లేదు. రఘురామరాజు ముందునుంచి నెగిటివ్‌గానే మాట్లాడుతున్నారు. ఈ రోజు వారు ఏదో మాట్లాడుతూ..రమేష్‌ ఆసుపత్రి గురించి మాట్లాడుతున్నారు. టీడీపీ నాయకులు ఆడించిన డ్రామా మేరకే రమేష్‌ ఆసుపత్రిని తెరపైకి తెచ్చారు. ఎవరైనా ప్రభుత్వ ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లలేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయి..ఇందుకు భిన్నంగా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సీఐడీ ఎఫ్‌ఐఆర్‌కు ముందుకు వాళ్లు నిబంధనల మేరకే వ్యవహరించారు. పద్ధతి ప్రకారం సీఐడీ అధికారులు నడుస్తున్నారు. అవతలి వైపు వ్యక్తులకు ఏ వ్యవస్థలు అండగా ఉన్నాయో అందరికీ తెలుసు.

 మధ్యాహ్నం హైకోర్టుకు బెయిల్‌ కోసం రఘురామరాజు వెళ్లాడు.అక్కడ కింది కోర్టుకు వెళ్లమని హైకోర్టు చెప్పింది. హైకోర్టు గవర్నమెంట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లమని ఆదేశించింది. మెడికల్‌ బోర్డుకు పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు సూచించింది. రమేష్‌ ఆసుపత్రి ఎక్కడినుంచి వచ్చిందో ఆశ్చర్యమనిపించింది. ప్రైవేట్‌ ఆసుపత్రి అనుకుందాం..ఒక్క రమేష్‌ మాత్రమే ఉందా? ఎన్ని ఆసుపత్రులు లేవు. వారి ఆరోపణల్లో హేతుబద్దత ఉందా?. రమేష్‌ ఆసుపత్రికి మంచి పేరు ఉందా? ఎందుకు ఆ పేరు ఎత్తుతున్నారు. ప్రతి దానికి మాకు నమ్మకం లేదంటే దానికి అంగీకరిస్తారా?. ఏ న్యాయమైనా? చట్టమైనా ఒక శాస్తీ్రయత ఉంటుంది. అడగగానే ఎలా రమేష్‌ ఆసుపత్రికి పంపిస్తారు. దీన్ని అందరి దృష్టికి తీసుకెళ్లాలని ఈ విషయాలు చెబుతున్నాం. మా ప్రభుత్వం కక్షసాధింపులు ఏమీ లేవు. పవర్‌లేని వ్యక్తులు మీడియా బలం చూసుకొని, కొన్ని శక్తులు ఏకమై..అత్యంత శక్తిమంతుడైన మా నాయకుడిపై కక్షాసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. మాకు, మా ప్రభుత్వానికి ప్రజల దీవెనలు ఉన్నాయి. ఆ ఆదరణ రోజు రోజుకు వైయస్‌ జగన్‌కు పెరుగుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top