జగనన్ననే మళ్లీ గెలిపించుకుంటాం

గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో ప్ర‌జ‌ల నుంచి అపూర్వ స్పంద‌న‌
 

తిరుపతి :గత ప్రభుత్వాలు అందించలేనన్ని సంక్షేమ పథకాలు అందించిన జగనన్ననే మళ్లీ గెలిపించుకుంటామని ప్ర‌జ‌లు నాయ‌కుల‌ చేతిలో చెయ్యేసి హామీ ఇస్తున్నారు.  అడిగితే తప్ప అమ్మ కూడా అన్నం పెట్టదు. అలాంటిది అడగకుడానే అన్నీ ఇచ్చిన మీరు చల్లంగుండాలయ్యా’ అంటూ గడపగడపనా ప్రజలు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ గురుమూర్తి, మేయర్‌ డాక్టర్‌ శిరీష, డిప్యూటీ మేయర్‌ భూమన అభినయ్‌రెడ్డిని ఆశీర్వదించారు. జగనన్న అందించిన సంక్షేమ పథకాలు తమ జీవితాలకు వెలుగులు ఇచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు.  తిరుపతి నగరంలోని 46 డివిజన్‌లో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి అపూర్వ ఆదరణ లభించింది. అడుగడుగునా హారతులు పట్టి ఆత్మీయంగా స్వాగతం పలికారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top