రాష్ట్రంలో దుర్మార్గమైన రాక్షస పాలన  

వైయ‌స్ఆర్ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి

ఇడ‌మ‌డ‌క గ్రామంలో వీర‌భ‌ద్రుడు కుటుంబానికి ప‌రామ‌ర్శ‌

వైయ‌స్ఆర్ జిల్లా:  రాష్ట్రంలో దుర్మార్గ‌మైన రాక్ష‌స పాల‌న సాగుతోంద‌ని వైయ‌స్ఆర్ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి మండిప‌డ్డారు. దువ్వూరు మండలం ఇడమడక గ్రామంలో రెడ్ బుక్ రాజ్యాంగానికి  జీవనోపాధిని కోల్పోయిన  వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త వీరభద్రుడు కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యేలు ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి,  శెట్టిపల్లి రఘురామిరెడ్డి ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ..`రాష్ట్రంలో దుర్మార్గమైన రాక్షస పాలన సాగుతుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టకుండా  కూటమి ప్రభుత్వం వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలను వేధించే పనిలో ఉంది. టిడిపి నేత‌లు వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు కార్యకర్తలను టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నారు. వీరభద్రుడు వైయ‌స్ఆర్‌సీపీ సానుభూతిపరుడు అనే కారణంతో అతని ఢాబాను టిడిపి ఎమ్మెల్యే చెప్పాడని అధికారులు కూల్చివేయడం దారుణం. నేషనల్ హైవేకు 20 మీటర్ల దూరంలో ఉన్న ఢాబాకు నేషనల్ హైవే వాళ్ళు నోటీసు ఇవ్వాలి గాని రెవెన్యూ వాళ్లు నోటీసులు ఇచ్చి వెంటనే కూల్చి వేయడం రెడ్ బుక్  రాజ్యాంగం అమలుకు నిదర్శనం కాదా? టిడిపి రెడ్ బుక్ రాజ్యాంగ బాధిత కుటుంబాలకు వైయ‌స్ఆర్‌సీపీ పార్టీ అండగా ఉంటుంది` అని ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి భ‌రోసా క‌ల్పించారు.

Back to Top