పాల డెయిరీలను మూసేసిన పాపాల బైరవుడు చంద్రబాబు

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి

చిత్తూరు: తన సొంత డెయిరీ హెరిటేజ్‌ వ్యాపారం కోసం పాల డెయిరీలను మూసేసిన పాపాల బైరవుడు చంద్రబాబు అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి ధ్వజమెత్తారు. విజయా డెయిరీ మూసేసి హెరిటేజ్‌ డెయిరీ నడుపుతోంది చంద్రబాబేనన్నారు. ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని లోకేష్‌నాయుడు కొంచెం సంస్కారం నేర్చుకొని మాట్లాడాలని సూచించారు. చిత్తూరు జిల్లాలో పాపాలు చేసింది చంద్రబాబేనని గుర్తుచేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అసత్య ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.  
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top