నారా భువనేశ్వరి, బ్రాహ్మిణి ఎన్ని సూట్‌కేసులు మోశారు..?

వైయస్‌ భారతమ్మ పేరు పలికే అర్హత కూడా అనితకు లేదు

ఐరన్‌ లెగ్‌ అని గూగుల్‌ని అడిగినా చంద్రబాబునే చూపిస్తుంది

ఒక్క కరువు మండలాన్ని కూడా ప్రకటించని గోల్డెన్‌ లెగ్‌ సీఎం వైయస్‌ జగన్‌

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి

విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని, ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయంలో సీఎం వైయస్‌ జగన్‌ పాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అన్నారు. గడిచిన మూడేళ్లలో సంక్షేమ పథకాల రూపంలో 1.65 లక్షల కోట్లను పేద ప్రజల బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేశారని గుర్తుచేశారు. తన పాలనలో మహిళలకు పెద్దపీట వేశారని, మహిళలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ముందుకు తీసుకెళ్తున్నారని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మహిళలకు ఇచ్చిన పథకాలు, రక్షణ కోసం చేపట్టిన పథకాలు, రాజకీయ పదవులు ఇంతకు ముందు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదన్నారు. 

విశాఖపట్నం జిల్లా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ వరుదు కల్యాణి విలేకరుల  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేదవాడు అయితే చాలు.. కులం, మతం, ప్రాంతం, వర్గం చూడకుండా పారదర్శకంగా పథకాలు అందిస్తున్నామన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ గ్రాఫ్‌ చాలా  పెరిగిందని, అందుకు ప్లీనరీ సమావేశాలే నిదర్శనమన్నారు. లక్షలాది మంది కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి సీఎం వైయస్‌ జగన్‌కు మద్దతు తెలిపారన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ ప్లీనరీ చూశాక తెలుగుదేశం పార్టీ నేతలకు నిద్రపట్టడం లేదని,  జీవితకాలంలో ముఖ్యమంత్రి కాలేనని చంద్రబాబుకు అర్థమైపోయిందన్నారు. ఆ ఫ్రస్టేషన్‌తో బాబు ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ కల్యాణి వ్యాఖ్యానించారు. 

తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు అనితను విశాఖపట్నంలో ప్రజలు అబద్ధాల అనిత, అభాండాల అనిత అంటారని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి చెప్పారు. అవివేక వ్యాఖ్యలు చేసేముందు అద్దంముందు నిల్చొని తనను తాను ప్రశ్నించుకుంటే బాగుంటుందని అనితకు సూచించారు. ఐరన్‌ లెగ్‌ అంటే రాష్ట్రంలో ఎవరిని అడిగినా చంద్రబాబు పేరు చెబుతారని, గూగుల్‌లో ఐరన్‌లెగ్‌ ఎవరూ అని సెర్చ్‌చేస్తే టక్కున చంద్రబాబు పేరు వస్తుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్న ఐదేళ్లలో కరువు మండలాలను ప్రకటించారని, చంద్రబాబు కరువు కవల పిల్లలు అని ప్రజలంతా అనుకుంటారని గుర్తుచేశారు. ‘‘పుష్కరాల సమయంలో చంద్రబాబు అడుగుపెట్టగానే 29 మంది చనిపోయారు. చంద్రబాబు పక్కరాష్ట్రాల్లో ఎవరికి మద్దతిస్తే వారు ఓడిపోతున్నారు. దాన్ని ఐరన్‌లెగ్‌ అంటారు’’ అని అనితపై ఫైరయ్యారు.  సీఎం వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ మూడేళ్లలో రాష్ట్రం సుబిక్షంగా ఉందని, ఒక్క కరువు మండలాన్ని కూడా ప్రకటించలేదని, అలాంటి గోల్డెన్‌లెగ్‌ సీఎం వైయస్‌ జగన్‌ అని ఎమ్మెల్సీ కల్యాణి అన్నారు. 

అనిత మరీ దిగజారిపోయి సీఎం వైయస్‌ జగన్‌ భార్య వైయస్‌ భారతమ్మ గురించి విమర్శలు చేస్తుందని, భారతమ్మ పేరు ఎత్తే అర్హత అనితకు లేదన్నారు. భారతమ్మ కాలిగోటికి కూడా అనిత సరిపోదని చెప్పారు. భారతమ్మ ఏరోజూ రాజకీయాల గురించి మాట్లాడలేదు, ఇన్‌వాల్వ్‌ అవ్వలేదని అన్నారు. బాధ్యతాయుతమైన మహిళగా భారతమ్మ ఉన్నారని చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 14 ఏళ్లు నారా భువనేశ్వరి ఎన్ని సూట్‌కేసులు మోసిందని, లోకేష్‌ మంత్రిగా ఉన్న సమయంలో బ్రాహ్మిణి ఎన్ని సూట్‌కేసులు మోశారని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ప్రశ్నించారు. 
 

Back to Top