స్మృతివ‌నంలో ఘ‌నంగా వైయ‌స్ఆర్ జ‌యంతి వేడుక‌లు

శ్రీ‌శైలం ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి ఆధ్వ‌ర్యంలో సంబరాలు

క‌ర్నూలు:  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జ‌యంతి వేడుక‌లు క‌ర్నూలు జిల్లా న‌ల్ల‌కాల్వ స‌మీపంలోని వైయ‌స్ఆర్ స్మృతివ‌నంలో ఘ‌నంగా నిర్వ‌హించారు.  సోమవారం మహానేత 70వ జయంతిని పురస్కరించుకుని శ్రీ‌శైలం ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి ఆధ్వ‌ర్యంలో భారీ కేక్ క‌ట్ చేశారు. ఈ సంద‌ర్భంగా నాయకులు, అభిమానులు పేద ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.ఇవాళ‌ ఉదయం  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి ఇడుపులపాయలోని వైయ‌స్ఆర్‌ ఘాట్‌ వద్ద ఘనంగా నివాళులర్పించారు.

రైతు బాంధవుడు,  వైయ‌స్ఆర్‌ జయంతి సందర్భంగా  రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో రైతు దినోత్సవం నిర్వహించారు. మరోవైపు ప్రతి పల్లెలోను మహానేతను స్మరించుకుంటూ ప్రజలు, అభిమానులు, నాయకులు ఆయనకు ఘన నివాళులర్పిస్తున్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా తమకు జరిగిన మేలును తలచుకుంటున్నారు. తమ గుండెల్లో పదిలంగా నిలిచిపోయిన ఆ మహానేత పుట్టిన రోజు తమకు పండుగ రోజేనని చెబుతున్నారు.
 

Back to Top