చంద్రబాబు పాలనలో అభివృద్ధి లేదు..సంక్షేమం లేదు

ప్రజలే వైయస్‌ జగన్‌కు ద్యాస..శ్వాస..

వైయస్‌ఆర్,జగన్‌కు ప్రేమను పంచడమే తెలుసు

సింహం సింగిల్‌గానే వస్తోంది..

విలువలకు,విశ్వసనీయతకు పట్టం కట్టండి

సాలూరు ఎన్నికల ప్రచార సభలో వైయస్‌ విజయమ్మ

 

శ్రీకాకుళం జిల్లా:చంద్రబాబు పాలనలో దోచుకోవడమే తప్ప అభివృద్ధి లేదు..సంక్షేమం లేదని వైయస్‌ విజయమ్మ ధ్వజమెత్తారు.సాలూరులో ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు.ఆనాడు వైయస్‌ఆర్‌ పాలనలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారని, నేడు చంద్రబాబు పాలనలో ప్రజలు కష్టాలు పడుతున్నారన్నారు.నేడు రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే బాధేస్తుందన్నారు.

ప్రసంగం ఆమె మాటల్లోనే.. 

అన్నదమ్ములకు,అక్కాచెల్లెమ్మలకు పేరుపేరునా హృదయపూర్వక నమస్కారాలు.వైయస్‌ఆర్‌ గుండెల్లో పెట్టుకున్న ప్రతి గుండెకు,జగన్‌ను అక్కున చేర్చుకున్న ప్రతి  హృదయానికి అభినందనలు.నేడు ధర్మానికి,అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతుంది.ఈ సారి తప్పనిసరిగా విలువలకు,విశ్వసనీయతకు పట్టం కట్టాలి. వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి కుటుంబానికి ప్రజల మధ్య 40 సంవత్సరాల అనుంబంధం.వైయస్‌ఆర్‌ను 30 సంవత్సరాలు మీ భుజ స్కందాలపై మోసి సీఎంను చేసుకున్నారు.ప్రజల కోసం వైయస్‌ఆర్‌ అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు.కులాలకు,మతాలకు,పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమపథకాలు అందించారు.వైయస్‌ఆర్‌ ఒకపైసా కూడా ట్యాక్స్‌లు వేయకుండా ప్రభుత్వాన్ని నడిపారు.అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేశారు.ప్రపంచంలోని రికార్డు అని అన్నారు.నేడు చంద్రబాబు హయాంలో ఎక్కడ చూసిన అన్యాయం,అక్రమం,దౌర్జనాలే కనబడుతున్నాయి. వైయస్‌ఆర్‌ హయాంలో వ్యవసాయం పండగ కావాలని జలయజ్ఞం ద్వారా ప్రాజెక్టులు మొదలుపెట్టారు.వైయస్‌ఆర్‌ రైతును రాజును చేయాలని అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు.ప్రాజెక్టులు,పరిశ్రమలు వైయస్‌ఆర్‌ తీసుకొచ్చారు.వైయస్‌ఆర్‌ మొదటి సంతకం ఉచిత విద్యుత్‌పై పెట్టారు.కరెంట్‌ బకాయిలు మాఫీ,రైతుల రుణాలు మాఫీ చేశారు.వంశధార,హాంద్రీనీవా,తోటపల్లి,మహేంద్ర తనయ,గాలేరునగరి వంటి అనేక ప్రాజెక్టులు తీసుకువచ్చారన్నారు. వైయస్‌ఆర్‌ హయాంలో డ్వాక్రా అక్కాచెల్లె్మలకు పావలా వడ్డీలకు రుణాలు ఇచ్చి ఆదుకున్నారు.పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించారు.ఆరోగ్యశ్రీ తీసుకువచ్చి పెద్దలకు,పిల్లలకు ఆపరేషన్లు చేయించారు.108,104 తీసుకొచ్చి లక్షల ప్రాణాలు కాపాడారు. పేదల పిల్లలు చదువుకోవాలని ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ప్రవేశపెట్టారు.అన్ని రకాలుగా అభివృద్ధి చేశారు.కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్‌ధరను కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించింది.110 రూపాయలకే తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులు ఇచ్చేవారు.

చంద్రబాబు హయాంలో ఏమి ఇస్తున్నారని అడుగుతున్నా..రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చేవారు.ఉద్యోగాల భర్తీలు కూడా చేశారు. చంద్రబాబు వచ్చాక అభివృద్ధి వెనుకకుపోయింది.90 శాతం పూర్తయిన ప్రాజెక్టులను కూడా పూర్తిచేసుకోలేని స్థితి లో ఉన్నాం.చంద్రబాబు హయాంలో ఒక పరిశ్రమ కూడా రాలేదు. వైయస్‌ఆర్‌ హయాంలో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు.రాష్ట్రాన్ని విడగొట్టుకుని నిరుపేద ఆంధ్రను చూస్తున్నాం. వైయస్‌ఆర్‌ మరణం నా కొచ్చిన కష్టం కంటే ఈ రాష్ట్రానికి వచ్చిన నష్టమే ఎక్కువ.వైయస్‌ఆర్‌ బతికుంటే ప్రాజెక్టులన్ని పూర్తిచేసేవారు.వైయస్‌ఆర్‌ చివర వరుకు ప్రజలే తలుచుకున్నారు. వైయస్‌ఆర్‌ మరణం తర్వాత జరిగిన పరిస్థితులు మీకు తెలుసు.వైయస్‌ఆర్‌ మరణం తర్వాత మా కుటుంబాన్ని చాలామంది వదిలేశారు. కాని ప్రజలు మాత్రం వదలలేదు. ఎంతో ఆదరణ చూపించారన్నారు.మా కుటుంబం మీకు రుణపడి ఉంటుంది.వైయస్‌ఆర్‌ మరణంతో ఎంతో మంది చనిపోయారు. ఇచ్చిన మాట కోసం జగన్‌ ఓదార్పు యాత్ర చేశారు.జగన్‌ను అక్కున చేర్చుకున్నారు. తండ్రి లేని బిడ్డకు మీరు ఓదార్పు ఇచ్చారు.ఓదార్పు యాత్ర తెల్లవారుజాము వరుకు కూడా వేచి చూశారు.జగన్‌ ఓదార్పుయాత్ర కాంగ్రెస్‌కు నచ్చలేదు. ఎన్నో అడ్డంకులు పెట్టారు.వైయస్‌ జగన్‌  ఇచ్చిన మాట కోసం కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చారు.ప్రజల కోసం నేనే నిలబడ్డాలని వైయస్‌ జగన్‌ అనుకున్నారు.వైయస్‌ఆర్‌ కుటుంబానికి  ప్రజలు ఎంతో ప్రేమిస్తున్నారు.కాంగ్రెస్‌ నిరంకుశత్వం, టీడీపీ వికృత చేష్టలతో కోర్టుకు వెళ్ళి అన్యాయంగా జగన్‌పై కుట్రలు చేశారు, ఎన్నో ఇబ్బందులు పెట్టి జైలుకు పంపించారు.తొమ్మిది సంవత్సరాల తర్వాత నేడు కూడా కుట్రలు చేస్తున్నారు.

ఎన్నికుట్రలు చేసిన వైయస్‌ జగన్‌ భయపడలేదు.తన కష్టాన్ని వైయస్‌ జగన్‌ను ఏ రోజు ప్రజలకు చెప్పుకోలేదు.వైయస్‌ జగన్‌ నిత్యం ప్రజలతోనే ఉన్నారు.ప్రత్యేక హోదా కోసం అనేక పోరాటాలు చేశారు.వైయస్‌ఆర్,షర్మిల,వైయస్‌ జగన్‌ పాదయాత్రను మీరు ఉండి నడిపించారు.పాదయాత్ర ద్వారా మీ కష్టాలు,బాధలు విన్నారు. అందరికి మా బిడ్డ అండగా ఉంటాడు.వైయస్‌ జగన్‌ అనుకుంటే ఏదైనా సాధిస్తాడు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడు.మా కుటుంబంపై  చంద్రబాబు అనేక వ్యాఖ్యలు చేస్తున్నారు.వైయస్‌ఆర్‌ బతికున్నప్పుడు నేను ఎన్నడూ  బయటకు రాలేదు.వైయస్‌ఆర్‌ మరణం తర్వాత వైయస్‌ జగన్‌ను అక్రమంగా జైల్లో పెట్టారు. 18 మందిని ఎమ్మెల్యేలను గెలిపించుకోవడానికి బయటకురావాల్సి వచ్చింది.ప్రతి సమయంలోనూ,ప్రతి పరిస్థితుల్లోనూ మా కుటుంబంతో ఉండేది ప్రజలే..జగన్‌ అండగా ఉంటాడు.బీజేపీ,కేసీఆర్‌తో వైయస్‌ జగన్‌కు పొత్తు ఉందని చంద్రబాబు  ప్రచారం చేస్తున్నారన్నారు.చంద్రబాబు బీజేపీతో నాలుగున్నర సంవత్సరాలు కలిసి ఉన్నాడు..అప్పుడు తల్లికాంగ్రెస్,పిల్ల కాంగ్రెస్‌ అని వ్యాఖ్యలు చేశాడు.నేడు కాంగ్రెస్‌తో చంద్రబాబు కలిశాడు.వైయస్‌ జగన్‌ బీజేపీ,కాంగ్రెస్,కేసీఆర్‌తో పొత్తు పెట్టుకోలేదన్నారు.వైయస్‌ జగన్‌ ఒంటరిగానే పోటిచేస్తారు.సింహం సింగిల్‌గానే వస్తోంది. పొత్తు ఉందంటే అది ప్రజలతోనే..చంద్రబాబు ఐదేళ్ల పరిపాలన పరిశీలిస్తే..ఆరు వందల హామీలిచ్చి  ప్రజలను మోసం చేశాడు.ప్రత్యేకహోదా కోసం మొదటి నుంచి పోరాటం చేస్తోంది వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరే..ఏపీని వైయస్‌జగన్‌ అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తాడు. చంద్రబాబు రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి వారిని బ్లాక్‌లిస్ట్‌లో పడేశారు.చంద్రబాబు చేసిన ఐదు సంతకాలకు దిక్కుదివాణం లేదు.మీ భవిష్యత్‌ మా భద్రత అంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారని, ఏం చేశావని ప్రజలకు భరోసా ఇస్తున్నావు..డ్వాక్రా అక్కాచెల్లెమ్మలకు రుణమాఫీ జరిగిందా అని అడుగుతున్నా..వైయస్‌ఆర్‌ హయాంలో ఉన్న గిట్టుబాటు,మద్దతు ధరలు ఉన్నాయా అని అడుగుతున్నా..తెలుగుదేశం నేతలు ఇసుకను అమ్ముకుంటున్నారు.బెల్ట్‌షాపులను రద్దుచేస్తానని చంద్రబాబు చెప్పాడు..కాని  ఏగ్రామంలో చూసిన బెల్ట్‌షాపులు కనబడుతున్నాయి.నీళ్లు దోరకకపోయినా మద్యం మాత్రం సంపూర్ణంగా దోరుకుతుంది.జాబు రావాలంటే బాబు రావాలని చెప్పాడు..వచ్చిందా అని అడుగుతున్నా..రెండు వేల రూపాయలు భృతి ఇచ్చాడా..అని అడుగుతున్నా..ప్రభుత్వంలో సుమారు 2 లక్షలకుపైగా ఉద్యోగాలు ఉంటే..కనీసం నోటిఫికేషన్‌ కూడా విడుదల చేయలేదు.చంద్రబాబు ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేశాడు. ఆసుప్రతులకు బిల్లులు కూడా చెల్లించలేదు.ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వకపోవడంతో విద్యార్థులు చదువులు మానేస్తున్నారు.

చంద్రబాబు హయాంలో అభివృద్ధి లేదు..సంక్షేమం లేదు.ఇసుక,మట్టి,భూములు అన్నింటిని అమ్ముకుంటున్నారు.ఎక్కడా చూసిన అన్యాయం,దౌర్జన్యం,మోసం..ఇదే జరుగుతుంది. తప్పకుండా వైయస్‌ఆర్‌ పాలనను గుర్తుతెచ్చుకోవాలి,వైయస్‌ జగన్‌కు ఒక్కసారి అవకాశం ఇవ్వాలి.వైయస్‌ జగన్‌ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తీసుకొచ్చి నవరత్నాలు ప్రకటించారు. వైయస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలను చంద్రబాబు ఏసీ రూంలో  కూర్చోని నేను చేస్తానని చెబుతున్నాడు.నవరత్నాలను చంద్రబాబు కాపీకొడుతున్నారు.వైయస్‌ఆర్‌ చేశారు..ఆయన కొడుకు వైయస్‌ జగన్‌ చేయబోతున్నాడు.పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్లుగా..ఎన్ని వాతలు పెట్టుకున్న పులి పులే..నక్క నక్కే.. వైయస్‌ఆర్‌ భరోసా ద్వారా పంట వేసే సమయానికి మే నెలలో సంవత్సరానికి రూ.12వేలు పెటుబడి భరోసాగా మీ చేతులకే ఇస్తాం. పంట బీమా చేస్తాం. వడ్డీలేని పంట రుణాలు ఇస్తాం రూ.3వేల కోట్లుతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తారు. గిట్టుబాటు ధరలకు ముందే గ్యారంటీ ఇస్తాం.  ఈ జిల్లాలో తుపానులు ఎక్కువగా వస్తుంటాయి. ప్రకృతి విపత్తుల సహాయనిధికి మరో 4వేల కోట్లు కేటాయింపు ఉపయోగపడుతుంది.  సహకార రంగానికి పాలు పోసే పాడి రైతుకు లీటర్‌కు 4 రూపాయలు బోనస్‌ ఇస్తాం.రైతులందరికి ఉచిత బోర్లు,వ్యవసాయానికి పగటిపూటే తొమ్మిది గంటల ఉచిత  విద్యుత్‌ ఇస్తాం. ప్రమాదశాత్తు లేదా ఆత్మహత్య కారణంగా రైతు దూరమైతే ఆ కుటుంబానికి రూ.7లక్షలు పరిహారం. ఆ డబ్బు అప్పులవాళ్లకు చెందకుండా చట్టం తీసుకువస్తాం.డ్వాక్రా అక్కాచెల్లెమ్మలకు ఎన్నికల నాటి వరుకు పొదుపు సంఘాల్లో మీకు అప్పు ఎంతైతే ఉందో ఆ మొత్తం సొమ్మును 4 దఫాల్లో నేరుగా మీ చేతికి ఇస్తాం. సున్నావడ్డీకే రుణాలు ఇచ్చి బ్యాంకుల వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుంది. 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారీటీ అక్కలకు కార్పొరేషన్ల ద్వారా 75 వేలు దఫాలుగా వైయస్‌ఆర్‌ చేయత పథకం ద్వారా ఉచితంగా ఇస్తాం.

అమ్మఒడి ద్వారా మీ పిల్లల్ని బడికి పంపితే చాలు మీ చేతికే సంవత్సరానికి 15 వేలు ఇస్తాం.పేద విద్యార్థులను ఉన్నత చదువులు చదివిస్తాం.నూటికి నూరుశాతం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తాం.వసతి,భోజనానికి అదనంగా ఏడాదికి రూ.20వేలు ఇస్తాం. 1000 రూపాయలు దాటిని ప్రతి వైద్యాన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చేలా చేస్తాం. దేశంలో ఎక్కడైనా వైద్యం చేయించుకునే అవకాశం ఇస్తాం.ఎంత ఖరీదైనా ఆపరేషన్‌ అయినా,వైద్యం అయినా సరే ఉచితంగా వైయస్‌ జగన్‌ ప్రభుత్వమే భరిస్తోంది.ఖాళీగా ఉన్న 2 లక్షల 30వేల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేస్తాం. 2008లో వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి  50వేల టీచర్‌పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీచేశారని గుర్తుచేశారు. ప్రతి ఏటా జనవరి 1న నోటిఫికేషన్ల  క్యాలెండర్‌ జారీ చేస్తాం. మన ప్రభుత్వం రాగానే గ్రామ సచివాలయాల ద్వారా యువతకు గ్రామానికి 10 ఉద్యోగాలు 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటిర్‌ ద్వారా ప్రభుత్వ పథకాలు మీ ఇంటికే అందేలా డోర్‌ డెలివరీ చేస్తాం. గ్రామ వాలంటిర్‌కు 5 వేలు గౌరవ వేతనం ఇస్తాం. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టం చేస్తాం.దీని కోసం తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు పెడతాం. 

అవ్వా,తాతలకు పింఛన్లు రూ.3వేలు పెంచుకుంటూ పోతానని మీ మనవడు వైయస్‌ జగన్‌ చెప్పమన్నాడు.వైయస్‌ఆర్‌ ఏవిధంగా ఈ రాష్ట్రానికి గొప్ప మేలు చేసి సుభిక్షంగా ఉంచారో అదేవిధంగా వైయస్‌ జగన్‌కూడా ప్రజలకు మేలు చేయాలనే ఆరాటంతో ఉన్నారు..రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తానని బీజేపీ మోసం చేసింది. రాష్ట్రంలో 25  ఎంపీ సీట్లు గెలుచుపించుకుని ప్రత్యేకహోదా తెచ్చుకుందాం.వైయస్‌ఆర్‌ వచ్చిన తర్వాతే మాకు వరి అన్నం అంటే ఏమిటో తెలిసిందని వైయస్‌ జగన్‌కు పాదయాత్రలో పగలుగన్నేరు గ్రామస్తులు చెప్పారంట..మా గ్రామానికి నాలుగే నాలుగు పెన్షన్లు వచ్చేవి.వైయస్‌ఆర్‌ వచ్చిన తర్వాత మా గ్రామానికి పెన్షన్లు వచ్చాయి, ఇళ్లు, వచ్చాయి, రోడ్లు వచ్చాయి.కరెంటు చూశామని చెప్పారంట..వైయస్‌ఆర్‌ కుల,మత,పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించారు.వైయస్‌ఆర్‌కు ప్రేమను పంచడమే తెలుసు, గిరిజనులకు 14 లక్షల ఎకరాలు వైయస్‌ఆర్‌ ఇచ్చారు.వైయస్‌ఆర్‌ పోడుభూములను,ఇళ్లును అక్కాచెల్లెమ్మ పేరమీదనే ఇచ్చారన్నారు.రేషనకార్డులు కూడా అకాచెల్లెమ్మల పేరునే ఇచ్చారు.రాజన్న రాజ్యంలో నవరత్నాలను ప్రతి ఇంటికి చేరాలని ఆశపడుతున్నాడు.వైయస్‌ జగన్‌కు ప్రజలకు మంచి చేయాలనే ధ్యాస తప్పితే మరోకటి లేదు

 

Back to Top