కరవు సహాయక చర్యల్లో చంద్రబాబు ప్రభుత్వం విఫలం

 రాయలసీమలో ఎండిపోతున్న ఉద్యాన పంటలు.. హార్టికల్చర్‌ హబ్‌ పేరుతో హడావుడి ఎందుకు?

మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి

అనంతపురం: రాష్ట్రంలో కరవు పరిస్థితులు తీవ్రంగా ఉన్నప్పటికీ కరవు సహాయక చర్యలు చేపట్టడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని వైయ‌స్ఆర్‌సీపీ ఉరవకొండ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. కరవు మండలాల ప్రకటనలో కొన్ని ప్రాంతాలకు మినహాయింపు ఇవ్వడం సరికాదని, కరవు ప్రభావిత ప్రాంతాలన్నింటినీ గుర్తించి రైతులను ఆదుకోవాలని కోరారు.

తాను విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు ఎల్‌–నినో ప్రభావంపై ముందుగానే ఎందుకు అప్రమత్తం కాలేదని విశ్వేశ్వరరెడ్డి ప్రశ్నించారు. రాయలసీమలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ఉద్యాన పంటలు ఎండిపోతున్నాయని, సాగు, తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ఇలాంటి పరిస్థితుల్లో రాయలసీమ హార్టికల్చర్‌ హబ్‌ పేరుతో హడావుడి చేయడం కంటే ప్రస్తుతం కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని అన్నారు. కరవు మండలాలను ప్రకటించి చేతులు దులుపుకోకుండా రైతుల రుణాలు మాఫీ చేయాలని, విద్యార్థుల ఫీజులు మాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని విశ్వేశ్వరరెడ్డి కోరారు.

Back to Top