రాజన్న రాజ్యం రావాలంటే వైయస్‌ఆర్‌సీపీకి ఓటేయండి

మార్కాపురం ఎన్నికల ప్రచార సభలో వైయస్‌ విజయమ్మ

వైయస్‌ఆర్‌ సంక్షేమ పథకాలను గుర్తు చేసుకోండి

చంద్రబాబు ఇచ్చిన 650 హామీలు ఏమయ్యాయి?

చంద్రబాబు పాలనలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు

జగన్‌ ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చుతాడు

నవరత్నాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారు

ప్రకాశం: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలన మళ్లీ రావాలంటే వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయాలని వైయస్‌ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ పిలుపునిచ్చారు. చంద్రబాబు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన 650 హామీలు ఏమయ్యాయని ఆమె ప్రశ్నించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకుంటున్న చంద్రబాబు వైయస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలను కాపీ కొడుతున్నారని విమర్శించారు. వైయస్‌ జగన్‌ సీఎం కాగానే రైతులకు పెట్టుబడి కింద రూ.12500 ఇస్తారని, రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తారని, ఉచిత విద్యుత్‌ ఇస్తారని హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు. వైయస్‌ విజయమ్మ ఏమన్నారంటే..ఆమె మాటల్లోనే.. 

 చంద్రబాబు 650 వాగ్ధానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని,కాని ఒక్కటైనా నెరవేర్చారా అని వైయస్‌ విజయమ్మ ప్రశ్నించారు.ప్రకాశం జిల్లా మార్కాపురం ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు. జగన్‌ తొమ్మిది సంవత్సరాలుగా ప్రతి సమస్య  కోసం పోరాటం చేస్తున్నారు. ప్రత్యేకహోదా,సమైక్యాం«ధ్ర కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు. జగన్‌ అనుకున్నది సాధిస్తారు. వైయస్‌ఆర్‌ బతికున్నప్పుడు ఎన్నడూ బయటకు రాలేదు.కాని నేడు ఆ పరిస్థితులు వచ్చాయి. మా కుటుంబంపై ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు.ప్రజల పక్షాన వైయస్‌ జగన్‌ పోరాటం చేస్తున్నారు. మీ అభిమానంతో నేడు మీ ముందుకు వచ్చాను.ఎన్ని కష్టాలు వచ్చిన జగన్‌ మీ ముందుకు ఎన్నడూ పెట్టలేదు. ప్రజల కోసమే నిలబడ్డాడు. మేము ఈ రోజు ఇలా నిలబడి ఉన్నామంటే అందుకు కారణం ప్రజలే. మా కుటుంబంలో మరిది వివేకానందరెడ్డిని కిరాతంగా హత్య చేశారని, అయినా మీ ముందుకు రావాల్సి వచ్చిందన్నారు. జగన్‌కు మీరు ఇచ్చిన ఆశీర్వాద బలమే కాపాడుతుందన్నారు. వైయస్‌ఆర్‌ హయాంలో ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారో గుర్తుచేసుకోండి.ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారు.కార్పొరేట్‌ ఆసుప్రతిల్లో వైద్యం చేయించుకోలేని ఎంతో మంది పేదలు ఆరోగ్యశ్రీ ద్వారా కొన్ని లక్షల మందికి ఆపరేషన్లు జరిగాయన్నారు.

చంద్రబాబు హయాంలో ఆరోగ్యశ్రీ ఏమయిందని అడుగుతున్నా. వైయస్‌ఆర్‌ బతికుంటే వెలుగొండ ప్రాజెక్టు ఎన్నాడో పూర్తయ్యేది. ఆయన హయాంలో 70శాతం పూర్తయింది.మిగిలింది పూర్తి చేయించడానికి చంద్రబాబుకు మనసు రాలేదు.తాగునీరు,సాగునీరుతో పాటు వెలుగొండ ప్రాజెక్టు పూర్తిచేస్తామని చెప్పమ్మా అని జగన్‌ చెప్పారు.వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే ఆరు నియోజకవర్గాలకు మేలు జరుగుతుందన్నారు.గుండ్లకమ్మ ప్రాజెక్టు 90 శాతం పూర్తయినా..lమిగిలింది పూర్తిచేయని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది.ఎన్నికలు మూడు నెలలు ఉన్నాయనగా చంద్రబాబుకు ప్రజలు గుర్తుకువస్తారు.రెండు సంవత్సరాల క్రితమే జగన్‌ నవరత్నాలను ప్రకటించారు.ఎన్నికలు మూడు నెలలు ఉన్నాయనగా, జగన్‌ ప్రకటించిన నవరత్నాలను చంద్రబాబు కాపీకొడుతున్నారు. వైయస్‌ఆర్‌ హయాంలో పంటలకు గిట్టుబాటు ధర లభించింది. నేడు పసుపు,కందికి మద్దతు ధర కూడా లభించడంలేదు.

వైయస్‌ఆర్‌ రైతు భరోసా జగన్‌ ప్రకటించారు.వ్యవసాయానికి పగటిపూట తొమ్మిదిగంటల విద్యుత్‌ ఇస్తారు.రైతన్నలకు వడ్డీలేని రుణాలు,మే నెలలో పెట్టబడికి అవసరమైన ప్రతి సంవత్సరం 12,500 ఇస్తారు.రైతులకు ఉచిత బోర్లు,ఆక్వా రైతులకు యూనిట్‌కు రూపాయి 50పైసాలకే విద్యుత్,ప్రతి నియోజకవర్గంలో కోల్డ్‌ స్టోరేజ్‌లు,ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు,సహకారి డైరీలకు పాలుపోస్తే 4 రూపాయలు బోనస్,ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్‌ రద్దు.మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, ప్రకృతి వైపరీత్యాలకు నాలుగు వేల కోట్లు, రైతు చనిపోతే రైతు కుటుంబానికి రూ.7లక్షల రూపాయలు,అప్పులకు సంబంధం లేకుండా అసెంబ్లీలో చట్టం కూడా తీసుకోస్తారు.జలయజ్ఞం ద్వారా వైయస్‌ఆర్‌ మొదలుపెట్టిన అని ప్రాజెక్టులను కూడా పూర్తిచేసి రైతులను ఆదుకుంటారు.జగన్‌ అధికారంలోకి రాగానే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసుకుందాం.

మనం అధికారంలోకి రాగానే చిన్న పరిశ్రమలకు న్యాయం జరుగుతుంది. వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికి న్యాయం జరుగుతుంది. జగన్‌ ప్రకటించిన నవరత్నాలను చంద్రబాబు కాపీ కొట్టారు. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాలు ద్వారా 10 మందికి ఉద్యోగాలు కల్పిస్తారు. 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమిస్తారు. ఆ వాలంటిర్‌కు 5వేలు ఇస్తారు.ఆ వాలంటీర్‌ గ్రామ సచివాలయానికి అనుసంధానం చేసుకుంటూ ప్రతి సంక్షేమ పథకం అందేలా చూస్తారు.పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగ అకాశాలు కల్పిస్తారు. జగన్‌పై టీడీపీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. జగన్‌ ఎప్పడూ ఎవరితోనూ కలవలేదు. బీజేపీతోనూ,కాంగ్రెస్‌తోను, కేసీఆర్‌తోను కలవలేదు.ఏపీ రాజకీయాల్లో సంబంధం లేని కేసీఆర్‌ ప్రస్తావన తీసుకొచ్చి రెచ్చగొడుతున్నారన్నారు. ప్రత్యేకహోదా కోసమే వైయస్‌ జగన్‌ నిరంతరం పోరాటం చేస్తున్నారు. ప్రత్యేకహోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. 25 మంది ఎపీలను గెలిపిస్తే ప్రత్యేకహోదా సాధించగలం. జగన్‌ను కళ్లలో పెట్టుకుని ఫ్యాన్‌గుర్తుకే ఓటేయాలి. రాష్ట్రంలో ఉన్నత స్థానంలో ఉంచడానికి జగన్‌ ఆరాటపడుతున్నారు. ఒకసారి వివేకంతో ఆలోచించండి. జగన్‌ను గెలిపించాలని కోరుతున్నా..మీరు వేసే చాలా విలువైనది.ఓటును జాగ్రత్తగా చూసి వేయాలని కోరుతున్నా..రాజన్న రాజ్యం  మళ్లీ రావాలంటే వైయస్‌ఆర్‌సీపీకి ఓటేయాలన్నారు.

Back to Top