వెన్నుపోటు పార్టీ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ.. 

జగన్ భద్రతపై తీవ్ర నిర్లక్ష్యం, వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులే ధ్యేయం:

మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ధ్వజం.

తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని)

ఇది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు... అసలు ఇంజినే లేని ప్రభుత్వం!

జెడ్ ప్లస్ భద్రతను గాలికి వదిలిన వెన్ను పోటు ప్రభుత్వం

చంద్రబాబు ప్రైవేట్ సైన్యంగా మారిన పోలీసులు 

పొగాకు రైతుల జీవితాలతో ఆడుకుంటున్న ప్రభుత్వం

ప్రజలు వైయస్.జగన్ ని కలవకుండా బ్యారికేడ్లా ?

డిఎస్సి పేరుతో దొంగ ఉద్యోగాల నియామకం

ప్రజల తరపున ప్రశ్నిస్తే భౌతిక దాడులు

విజయవాడలో వైఎస్సార్‌సీపీ దీక్షా శిబిరంపై రౌడీ మూకల దాడి

 కూటమి ప్రభుత్వ పతనాన్ని ఎవరూ ఆపలేరు

మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ధ్వజం

తాడేపల్లి : చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని వెన్నుపోటు పార్టీ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కాలరాస్తోందని, ప్రజలకు అండగా నిలవాల్సిన బాధ్యతను విస్మరించి దుర్మార్గ పాలన సాగిస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...  ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ కి అధికారికంగా జెడ్ ప్లస్ (Z+) కేటగిరీ భద్రత ఉన్నప్పటికీ, చంద్రబాబు ఆదేశాలతో హోం శాఖ మరియు రాష్ట్ర పోలీసులు ఉద్దేశపూర్వకంగానే ఆయన భద్రతను పూర్తిగా గాలికి వదిలేశారని మండిపడ్డారు. దేవరపల్లి పర్యటనలో కనీసం హెలిప్యాడ్ వద్ద గానీ, పొగాకు వేలం కేంద్రానికి వెళ్లే మార్గంలో గానీ ఒక్క పోలీసును కూడా ఉంచకుండా తీవ్ర నిర్లక్ష్యం వహించారని విమర్శించారు.

ఒకవైపు పొగాకు రైతులను పట్టించుకోకుండా, వారి పంటలకు మద్దతు ధర ఇవ్వకుండా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నాశనం చేసిన ఈ ప్రభుత్వం, రైతుల కష్టాలను ఆలకించడానికి వెళ్లిన ప్రతిపక్ష నేతకు ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే తట్టుకోలేకపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం భద్రత కల్పించడంలో విఫలమవ్వడమే కాకుండా,  వైయస్.జగన్ ని కలిసేందుకు ఉత్సాహంగా వస్తున్న వేలాది మంది ప్రజలను, అభిమానులను అడ్డుకోవడానికి ఐదు కిలోమీటర్ల ముందే వందలాది మంది పోలీసులతో బ్యారికేడ్లు పెట్టి అష్టదిగ్బంధనం చేశారని దుయ్యబట్టారు. ప్రభుత్వ చేతగానితనాన్ని, కక్షసాధింపు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని, ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ప్రతిపక్ష నేత పర్యటనలకు జనం రాకుండా కుట్రలు పన్నుతున్న ఈ ప్రజావ్యతిరేక కూటమి ప్రభుత్వ పతనం ఖాయమని పేర్ని నాని హెచ్చరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే... 

ప్రైయివేటు సైన్యంలా పోలీసులు..

చంద్రబాబు, లోకేష్‌ల డైరెక్షన్‌లో పోలీసులు ప్రైవేటు సైన్యంగా మారిపోయారు. ప్రతిపక్ష నాయకుడిపై ప్రజల్లో ఉన్న అభిమానాన్ని తట్టుకోలేక, భద్రతను గాలికి వదిలేసి కుట్రలు పన్నుతున్నారు. 

గాల్లో దీపంలా వైఎస్ జగన్ భద్రత....

మాజీ ముఖ్యమంత్రి, జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పర్యటనల్లో కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం హోం శాఖ, రాష్ట్ర డిజిపి, స్థానిక ఎస్పీల బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. దేవరపల్లి పర్యటనలో హెలిప్యాడ్ వద్ద కానీ, వేలం కేంద్రానికి వెళ్లే మార్గంలో కానీ ఒక్క పోలీస్ కూడా కనిపించలేదు. జెడ్ ప్లస్ భద్రతలో మాండేటరీగా ఉండాల్సిన రోప్ పార్టీని కూడా కేటాయించలేదు. పోలీసులను కనీసం వాహనాల నుంచి కిందకు దిగొద్దని పైనుంచి ఆదేశాలు ఇచ్చారంటే ఈ ప్రభుత్వం ఎంతటి కుట్రపూరితంగా వ్యవహరిస్తుందో అర్థమవుతోంది.

జనాన్ని అడ్డుకోవడానికే బ్యారికేడ్లు... సెక్యూరిటీకి కాదు..

దేవరపల్లి పర్యటనకు ప్రజలు, అభిమానులు రాకుండా ఐదు కిలోమీటర్ల ముందే వందలాది మంది పోలీసులను పెట్టి బ్యారికేడ్లు కట్టి అడ్డుకున్నారు. కానీ, జగన్ గారి వద్ద మాత్రం ఒక్క పోలీస్‌నూ ఉంచలేదు. ప్రజలు తమ కష్టాలను ప్రతిపక్ష నేతకు చెప్పుకోకూడదని, ప్రభుత్వ వైఫల్యాలు బయటపడకూడదని ఈ కప్పిపుచ్చే యత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు గారూ... మీ శునకానందం కోసం వ్యవస్థలను దిగజార్చకండి. గతంలో అనంతపురంలో కూడా భద్రత కల్పించకపోవడం వల్ల తొక్కిసలాట జరిగి హెలికాప్టర్ విండ్‌షీల్డ్ ఊడిపోతే, నిందను ప్రజలపై వేసి పైలట్లను బెదిరించారు. సత్తెనపల్లిలో సింగయ్య అనే వ్యక్తి మరణిస్తే ఉద్దేశపూర్వకంగావైయస్. జగన్ పైనా, నాయకులపై తప్పుడు ఎఫ్ఐఆర్‌లు కట్టారు. ఇవన్నీ డిజిపికి ఎన్నోసార్లు లేఖల ద్వారా విన్నవించినా చెవిటివాని ముందు శంఖం ఊదినట్లే తయారైంది.

విజయవాడలో వైఎస్సార్‌సీపీ దీక్షా శిబిరంపై రౌడీ మూకల దాడి..

విజయవాడ నడిబొడ్డున డీఎస్సీ అక్రమాలు, బోగస్ సర్టిఫికెట్ల నియామకాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై శాంతియుతంగా దీక్ష చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకులపై, మహిళలపై ఎమ్మెల్యే బోండా ఉమా తన రౌడీ మూకలతో దాడి చేయించడం అత్యంత దారుణం. శిబిరాన్ని ధ్వంసం చేసి, మహిళలను కొట్టి, డాబాలెక్కి మూత్రం పోసేంత అరాచకానికి తెగబడ్డారు. ప్రాణభయంతో హోమ్ మినిస్టర్ చెప్పినట్లు 'ఫోన్ ఊపినా' ఒక్క పోలీస్ కూడా రాలేదు. పైగా దాడికి గురైన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లడం విడ్డూరంగా ఉంది. టీడీపీ కార్యాలయం ఈస్ట్ ఇండియా కంపెనీలా, పోలీసులు వాళ్ల ప్రైవేట్ సైన్యంలా మారిపోయారు.

డిఎస్సి అక్రమాలు, కూటమి పాలనలో నాశనమైన విద్యా వ్యవస్ధ.. 
 
చదువు, అర్హత, టెట్, డీఎస్సీ రాయకుండా దొంగ సర్టిఫికెట్లతో ఉపాధ్యాయులను, వ్యాయామ ఉపాధ్యాయులను నియమిస్తూ విద్యా వ్యవస్థను నాశనం చేశారు. దీనిపై సీబీఐ విచారణ కోరడం, లోకేష్ రాజీనామా డిమాండ్ చేయడం తప్పా? పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వరు?, వసతి దీవెన నిధులు చెల్లించరు కానీ.. యోగా మ్యాట్లకు రూ. 350 కోట్లు, మోదీ గారి భజన సభలకు వందల కోట్లు ఖర్చు పెడతారు. ఎన్నికల ముందు ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీ ఏమైంది? ఇవన్నీ నిలదీస్తుంటే తట్టుకోలేక రౌడీయిజం చేస్తున్నారు.

వైయస్. జగన్ చెప్పాకే రాజధాని అమరావతి-విజయవాడ-గుంటూరు ప్రతిపాదన..

వైయస్. జగన్ గతంలో విజయవాడ, గుంటూరులతో కలిపి రాజధాని అభివృద్ధి అని చెప్పినప్పుడు విమర్శించిన చంద్రబాబు, నిన్న సిఆర్డిఎ (CRDA) సమావేశంలో విజయవాడ, గుంటూరులను కలిపి రాజధానిగా తీర్మానం చేశారు. జగన్ గారి విజన్‌ను కాపీ కొట్టడం తప్ప చంద్రబాబుకు సొంత ఆలోచన లేదు. అమరావతి, మంగళగిరి పరిసరాల్లో మట్టి మాఫియా, లేఔట్ల దోపిడీ, అవినీతి రాజ్యమేలుతోంది. మట్టి నుంచి సముద్రం దాకా దేన్నీ వదలకుండా దోచుకుంటున్నారు.

ఎన్ని కుట్రలు చేసినా వైఎస్సార్‌సీపీ పోరాటం ఆగదు..

చంద్రబాబు, లోకేష్‌లతో పాటు రామోజీరావు అబ్బాయికి, రాధాకృష్ణకు అధికారం పోతుందనే ఆత్రం తప్ప ప్రజల కష్టాలు పట్టవని.. వీరి తీరు అప్ప ఆత్రం తప్ప బావా పోరాటం లేదన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు.  ఎన్ని అబద్ధపు వార్తలు రాసినా, ఎంతటి దుష్ప్రచారం చేసినా 2029లో ఈ ప్రభుత్వానికి పచ్చడి కావడం ఖాయమని స్పష్టీకరించారు. స్వయంగా టీడీపీ కార్యకర్తలే ఈ అరాచక పాలన అంతం కావాలని కోరుకుంటున్నారని..  పోలీసుల భద్రత ఉపసంహరించినా, కేసులు పెట్టి వేధించినా, చివరికి మూత్రం పోసి రాక్షసానందం పొందినా... ప్రజల తరఫున వైఎస్ జగన్  గారి పోరాటం ఆగదని.. వెన్నుపోటు పార్టీ ప్రభుత్వ  పతనాన్ని ఎవరూ ఆపలేరని తేల్చి చెప్పారు.

Back to Top