హైకోర్టు తీర్పుతో చంద్రబాబు మోసానికి ఫుల్ స్టాప్ 

బీసీల్ని నిజంగా ఆదుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డిదే

మాజీ మంత్రి ఉష శ్రీచరణ్ స్పష్టీకరణ

తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి ఉష శ్రీచరణ్

చెల్లవని తెలిసినా 34 శాతం బీసీ రిజర్వేషన్లు 

మరోసారి బట్టబయలైన చంద్రబాబు మోసం

జీవోలు ఇచ్చేదీ, కోర్టులకెళ్లి అడ్డుకునేదీ ఆయనే

స్థానిక ఎన్నికల్లో బీసీల్ని వాడుకోవాలనే కుట్రలకు చెక్

ఉష శ్రీ చరణ్ వెల్లడి

బీసీల పట్ల చంద్రబాబు చిత్తశుద్ది జీరో

బీసీల్ని రాజకీయంగా , ఆర్దికంగా ఆదుకున్న జగన్

50 శాతం నామినేటెడ్ పోస్టులు, పనులు ఇచ్చారు

బీసీల్ని బ్యాక్ బోన్ కులాలుగా చూసిన జగన్ 

ఉష శ్రీ చరణ్ కితాబు

50 ఏళ్లు దాటిన బీసీలకు పెన్షన్ హామీ ఎక్కడ ?

నేతన్న నేస్తంలో ఎక్కడ చూసినా కోతలే

ప్రశ్నించే  బీసీ నేతలపై కేసులతో వేధింపులు

స్థానిక ఎన్నికల్లో కూటమికి బీసీలే బుద్ది చెప్తారు

తేల్చిచెప్పిన ఉష శ్రీ చరణ్

తాడేపల్లి: 34 శాతం రిజర్వేషన్ల పేరుతో స్థానిక ఎన్నికల్లో బీసీల్ని మోసం చేసేందుకు చంద్రబాబు పన్నని కుట్రలకు హైకోర్టు తీర్పుతో చెక్ పడిందని వైయ‌స్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి ఉష శ్రీ చరణ్ స్పష్టం చేశారు. బీసీలంటే ఎప్పుడూ చంద్రబాబుకు చిన్నచూపే అని, అందుకే చెల్లవని తెలిసినా రిజర్వేషన్ల పేరుతో డ్రామాలు చేసి, కోర్టులో మొట్టికాయలు తిన్నారని తెలిపారు. బీసీలను నిజంగా అన్ని విధాలుగా ఆదుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే అని, ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు, పదవులు, 50 శాతం నామినేటెడ్ పోస్టులు, పనులే ఇందుకు సాక్ష్యమని ఉష శ్రీ చరణ్ గుర్తుచేసుకున్నారు. చంద్రబాబు చేసిన మోసానికి బీసీలు స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెప్పడం ఖాయమని ఉష శ్రీ చరణ్ తేల్చిచెప్పారు.
ప్రెస్ మీట్లో ఉష శ్రీ చరణ్ ఇంకేమన్నారంటే...

చంద్రబాబు బీసీ రిజర్వేషన్ల  డ్రామాలకు చెక్ 

బీసీలకు ఇస్తున్న 34 శాతం రిజర్వేషన్ చెల్లదని తెలిసినా కూడా చంద్రబాబు ఇచ్చినట్లే ఇచ్చి మోసం చేసారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ప్రకటించగానే.. బిర్రు ప్రతాపరెడ్డి అనే వ్యక్తిని సుప్రీంకోర్టుకు పంపి చంద్రబాబు అప్పట్లో దీన్ని కొట్టేయించారు. రూల్స్ పెట్టేది ఆయనే, తిరిగి కోర్టులకు వెళ్లి వాటిని అడ్డుకునేదీ ఆయనే. జరగబోయే పరిణామాలపై పూర్తి అవగాహన ఉన్నప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలను వాడుకోవాలనే చంద్రబాబు ఇలాంటి కుట్రలు చేస్తున్నారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది, బీసీలు నిరాశలో ఉన్నారు కాబట్టి అసత్యాలు చెప్పి వారిలో ఆశ నింపే ప్రయత్నాలు చేశారు. దానికి ఇవాళ పుల్ స్టాప్ పడింది. బీసీ రిజర్వేషన్లు సుప్రీంకోర్టు, హైకోర్టులో చెల్లవని తెలిసినా చంద్రబాబు అబద్దాలు చెప్తున్నారంటే.. బీసీల పట్ల ఆయన చిత్తశుద్ది ఏపాటిదో మనం ఆలోచించాలి. చంద్రబాబు కేంద్రం, రాష్ట్రాల్లో కూడా అధికార భాగస్వామిగా ఉన్నారు. బీసీ రిజర్వేషన్ల పట్ల ఆయనకు చిత్తశుద్ది ఉంటే పార్లమెంట్ లో చట్టం చేయించవచ్చు. కానీ బీసీలు జడ్జిలకు పనికి రారు, పాలనకు కూడా పనికిరారన్న భావనలో చంద్రబాబు ఎప్పుడూ ఉంటారు. బీసీల పట్ల ఆయన చిత్తశుద్ది జీరో అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. నిజంగా బీసీలకు రాజకీయంగా, ఆర్దికంగా, సామాజికంగా మేలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారే. చంద్రబాబును నమ్మే పరిస్ధితుల్లో జనం లేరు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం నామినేటెడ్ పదవులు, పనులు కేటాయించారు. బీసీల్ని ఓటు బ్యాంకుగా మాత్రమే చూసే చంద్రబాబుకూ, బీసీలు బ్యాక్ బోన్ కులాలుగా చూసే జగన్మోహన్ రెడ్డి గారికీ ఏమాత్రం పోలిక లేదు. 

బీసీల్ని అన్ని విధాలా ఆదుకున్న జగన్ 

బీసీలకు నాలుగు రాజ్యసభ ఎంపీ పదవులు, 11 లోక్ సభ ఎంపీ పదవులు, 20 ఎమ్మెల్సీ పదవులు, ఆరు జడ్పీ ఛైర్ పర్సన్లు, 9 మేయర్లు, 239 ఎంపీపీ పోస్టులు, 44 మున్సిపల్ ఛైర్ పర్సన్లు, 227 జడ్పీటీసీలు, 4 వేల మంది సర్పంచ్ లు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఇవన్నీ రికార్డుల్లో ఉన్నాయి. బీసీల బతుకుల్ని మార్చింది జగన్మోహన్ రెడ్డి గారే అని మేం గర్వంగా చెప్పుకుంటాం. బీసీలకు 50 శాతం రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించాలని పార్లమెంట్ లో ప్రైవేటు బిల్లు పెట్టించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. బీసీలకు ప్రత్యేక శాఖ కావాలంటే మరో బిల్లు కూడా ప్రవేశపెట్టించారు. 139 బీసీ కులాలకు కలిపి 56 కార్పోరేషన్లు ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి గారే. బీసీల కులవృత్తులు అంతరించిపోకుండా ఉండేందుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలన్న ఆలోచన కూడా ఆయనదే. ఏ కులం తీసుకున్నా ఓ అన్నగా, తమ్ముడిగా ఆలోచిస్తూ వారికి న్యాయం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. డీబీటీ ద్వారా లక్షా 30 వేల కోట్లు బీసీల ఖాతాల్లో క్రెడిట్ చేయించారు. నాన్ డీబీటీ ద్వారా 1.8 లక్షల కోట్లు బీసీలకు ఖర్చుపెట్టారు. అప్పట్లో డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు బీసీల్ని అన్ని విధాలా ఆదుకున్నారు. 

చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు బీసీలు సిద్దం

50 ఏళ్లు నిండిన బీసీలకు పెన్షన్ ఇస్తామన్న చంద్రబాబు హామీ ఏమైంది ? మూడు బడ్జెట్లు పూర్తయినా ఇప్పటికీ దాని ఊసే లేదు. బీసీల్ని చంద్రబాబు ఓటు బ్యాంక్ గా మాత్రమే చూస్తారన్న దానికి ఇదే నిదర్శనం. చేనేతలకు నేతన్న నేస్తం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఏటా 24 వేలు ఇచ్చి ఆదుకున్నారు. పెనుగొండలో సోమందేపల్లి మండలంలో అక్కడ బీసీ అన్నదమ్ములందరికీ 1200 మందికి పైగా నేతన్న నేస్తం ఇచ్చాం. కానీ ఇప్పుడు చేనేత నేస్తం పేరుతో కేవలం 250 మందికి ఇచ్చి వదిలేస్తున్నారు. బీసీల పట్ల మీ చిత్తశుద్ది ఇదేనా ? కరువుతో అనంతపురం జిల్లా,సత్యసాయి జిల్లాల్లో రైతులు అల్లాడుతున్నారు. వీరిలో సగం మంది బీసీలు ఉన్నారు. వీరికి ప్రత్యామ్నాయ పంటలు చూపించాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. కరువుతో పంటలు ఎండిపోతున్నా పట్టించుకోలేదు.  జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించాక కరువు మండలాల్ని ప్రకటించారు. బీసీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం బీసీ పిల్లలకు ఫీజు రీయింబర్స్ మెంట్ కూడా ఇవ్వలేకపోతున్నారు. దీంతో వారు సర్టిఫికెట్లు తీసుకోలేక, ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. కురుబ సామాజిక వర్గానికి చంద్రబాబు ఎన్నికలకు ముందు ఎన్నో హామీలిచ్చారు. అందులో గుడికట్ల పూజారులకు 5 వేలు ఇస్తామని చెప్పి మోసం చేశారు. బీసీ శాఖ మంత్రిగా ఉన్న సవితమ్మ తన సొంత సామాజికవర్గం అయినా మంత్రి పదవి పోతుందని మాట్లాడటం లేదు. బీసీలకు ఏ పథకం ఎప్పుడు ఇస్తారో తెలియని మంత్రి సవితమ్మ. నాగరికత ప్రారంభమైనప్పటి నుంచీ కులవృత్తులు చేసుకుంటున్న రజకులు, నాయీ బ్రాహ్మణుల్ని ఉద్దరించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు చేశారు. కానీ ఇవాళ ప్రభుత్వం వాళ్లను పూర్తిగా గాలికొదిలేసింది. 
    ప్రశ్నించే వైయ‌స్ఆర్‌సీపీ  బీసీ నాయకులపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఇందులో సీదిరి అప్పలరాజు, విడదల రజనీ, కారుమూరి సునీల్, విరూపాక్షి, జోగి రమేశ్ వంటి నేతలు ఉన్నారు. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు చేసిన మంచిని ప్రజలకు వివరిస్తున్నారని, గట్టిగా మాట్లాడుతున్నారని వీరిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. బీసీల్ని ఓటు బ్యాంకుగా ఎల్లప్పుడూ చూడటం చంద్రబాబుకు కష్టమని గుర్తుంచుకోవాలి. బీసీలు అమాయకులని చంద్రబాబు అనుకోవద్దు. మీడియా, సోషల్ మీడియాలు ఉన్నాయని చంద్రబాబు దుష్ప్రచారాలు చేస్తున్నారు. బీసీల్ని ఇప్పటికైనా సీరియస్ గా  తీసుకుని ఆదుకోకపోతే,  బీసీలంతా ఏకమై మీ స్ధానం గల్లంతు చేస్తారని చంద్రబాబు గుర్తుంచుకోవాలి. బీసీ రిజర్వేషన్లపై పార్లమెంట్ లో చట్టం తీసుకొచ్చి వారికి న్యాయం చేసే వరకూ వైయ‌స్ఆర్‌సీపీ పోరాడుతూనే ఉంటుందని మాజీ మంత్రి ఉష శ్రీ చరణ్ తేల్చిచెప్పారు.

Back to Top