స్థానిక ఎన్నికలకు సర్వసన్నద్ధం

దాదాపు 9 గంటల పాటు వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ సుదీర్ఘ కసరత్తు

 పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో ముఖాముఖి సమావేశాలు

 జిల్లాల వారీగా క్షేత్రస్థాయి పరిస్థితులపై సమగ్ర సమీక్ష

 ఎన్నికల సన్నాహాలు, అభ్యర్థుల ఎంపికపై విస్తృత చర్చ

 స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే వైయస్సార్‌సీపీదే విజయం

 ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్న వైయస్‌ జగన్‌

 తాడేపల్లి:     స్థానిక సంస్థల ఎన్నికలకు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని పూర్తిస్థాయిలో సన్నద్ధం చేసే దిశగా మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌ విస్తృత కసరత్తు చేపట్టారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో రీజినల్‌   కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ముఖ్య నేతలతో ఆయన సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సమావేశాలు రాత్రి 8 గంటల వరకు ఏకధాటిగా దాదాపు తొమ్మిది గంటలు కొనసాగాయి. ఒక్కో జిల్లా పరిస్థితిని విడివిడిగా సమీక్షించిన శ్రీ వైయస్‌ జగన్, క్షేత్రస్థాయిలో పార్టీ బలం, ఎన్నికల సన్నాహాలు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై నేతలతో విస్తృతంగా చర్చించారు.

జిల్లాల వారీగా లోతైన సమీక్ష:
    జిల్లాల వారీగా ఆయా జిల్లాల అధ్యక్షులు, రీజినల్‌ కోఆర్డినేటర్లతో పరిస్థితి సమీక్షించిన శ్రీ వైయస్‌ జగన్, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు తగిన అభ్యర్థులు. వారి ఎంపికలో అనుసరించాల్సిన వ్యూహం ఏమిటి? అన్న వాటిపై దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారని, స్థానిక ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్టీ అన్ని విధాలుగా సన్నద్ధంగా ఉందని నేతలు వైయస్‌ జగన్‌కు వివరించారు.

ప్రజల్లో వెన్నుపోటు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి:
    వెన్నుపోటు పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు, పాలన, స్థానిక సమస్యలు తదితర అంశాలపై ప్రజల్లో అసంతృప్తి ఉందని సమావేశంలో పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. వివిధ వర్గాల నుంచి ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపిస్తోందని వారు శ్రీ వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగితే పార్టీదే విజయమని, ఎందుకంటే ప్రజల మద్దతు వైయస్సార్‌సీపీకే ఉందని చెప్పారు.

అధికార దుర్వినియోగo:
    స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి బెదిరింపులు, పోలీసు వ్యవస్థ దుర్వినియోగం కొనసాగుతోందని, మరోవైపు ఎన్నికల్లో పోటీకి అవసరమైన సర్టిఫికెట్ల జారీలో కూడా ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని పలువురు నేతలు సమావేశంలో శ్రీ వైయస్‌ జగన్‌ దృష్టికి తెచ్చారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వైయస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులను బెదిరిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వంపై నానాటికీ పెరుగుతున్న అసంతృప్తిని ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక, విపక్షంపై దౌర్జన్యాలకు దిగుతున్నారని, అందుకు పోలీసు బలాన్ని ఉపయోగిస్తున్నారని వివరించారు.

ఆ ఉద్దేశం చంద్రబాబుకు లేదు:
    కాగా, స్థానిక ఎన్నికలను సాఫీగా జరిపించే ఉద్దేశం చంద్రబాబుకు లేదని శ్రీ వైయస్‌ జగన్‌ అన్నారు. చంద్రబాబు మోసాలు, దౌర్జన్యాలు, స్కామ్‌లు అరాచకాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ప్రతి వర్గం కూడా చంద్రబాబు పాలన పట్ల తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారని, అందుకే స్థానిక ఎన్నికలను సజావుగా జరిపే ఆలోచన చంద్రబాబుకు లేదని తెలిపారు. మరోవైపు వైయస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు ఉత్సాహంతో ఉన్నారని చెప్పారు. 

థీటుగా ఎదుర్కొందాం: 
    ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పార్టీ శ్రేణులు ధైర్యంగా నిలబడాలని శ్రీ వైయస్‌ జగన్‌ నేతలకు సూచించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలను ఎదుర్కొనేందుకు ప్రతి స్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నాయకత్వం సమన్వయంతో పని చేయాలని, కార్యకర్తలకు అండగా నిలవాలని సూచించారు. అభ్యర్థుల ఎంపికలో స్థానిక పరిస్థితులు, ప్రజాదరణ, పార్టీ పట్ల నిబద్ధత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని, ఏకాభిప్రాయంతో అభ్యర్థుల ఎంపిక జరగాలని శ్రీ వైయస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు.

Back to Top