టీడీపీకి ఓటేస్తే ఉరేసుకున్నట్టేనట!

నూజివీడు సభలో వైయస్‌ షర్మిల

చంద్రబాబు, లోకేష్‌ నారారూప రాక్షసులు

చంద్రబాబు మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దు

హోదా బతికుందంటే అందుకు కారణం జగనన్న చేసిన పోరాటాలే

కేసీఆర్‌తో పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాడారు

వైయస్‌ఆర్‌సీపీకి ఎవరితోనూ పొత్తు లేదు..సింహం సింగిల్‌గా వస్తుంది

ఓట్ల కోసం వచ్చే చంద్రబాబును గత హామీలు నెరవేర్చాలని నిలదీయండి

 

కృష్ణా జిల్లా: టీడీపీకి ఓటు వేస్తే మనల్ని మనమే ఉరి వేసుకున్నట్లే అని చంద్రబాబు కుమారుడు లోకేష్‌ అన్నారని వైయస్‌ షర్మిల తెలిపారు. కుల పిచ్చి, మత పిచ్చి ఉన్న పార్టీ ఏదైనా ఉంటే అది టీడీపీనే అని లోకేష్‌ అన్నట్లు వీడియోలు వైరల్‌ అవుతున్నాయని ఆమె వివరించారు. చంద్రబాబు, లోకేస్‌ ఇద్దరూ కూడా నారారూప రాక్షసులన్నారు. ఓట్ల కోసం వచ్చే చంద్రబాబును గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల సంగతి ఏంటని నిలదీయాలని ఆమె పిలుపునిచ్చారు. రాజన్న రాజ్యం కావాలంటే  వైయస్‌ జగన్‌ సీఎం కావాలన్నారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా నూజివీడులో ఏర్పాటు చేసిన సభలో షర్మిలమ్మ మాట్లాడారు.

వైయస్‌ఆర్‌ ఒక్క ఛార్జీ కూడా పెంచలేదు
వైయస్‌ రాజశేఖరరెడ్డి ఏపీకి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి. తన ప్రజలకు ఇలా చేయాలని ఆలోచించారు. చేసి చూపించారు. ఏపథకాలు రూపొందించి వాటిని అమలు చేయాలని వైయస్‌ఆర్‌ చేసి చూపించారు. ఐదేళ్లలో ఒక ఛార్జీ పెంచలేదు. అద్భుతమైన ముఖ్యమంత్రిగా ప్రజల్లో నిలిచారు. మీది ఏ కులమని అడగలేదు. ఏ మతమని అడగలేదు. నా పార్టీనా? వేరే పార్టీనా అని అడగలేదు. తన, పర అందరికి మేలు చేసిన నాయకుడు ఒక్క వైయస్‌ రాజశేఖరరెడ్డి ఒక్కరే అని గర్వంగా చెప్పుకోవచ్చు.

చంద్రబాబు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు
నారా చంద్రబాబు ఉన్నారు. ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదో చంద్రబాబే ఊదహరణ. రైతుల రుణాలు మాఫీ చేస్తానని వాగ్ధానం చేశారు. డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తానని వాగ్ధానం చేశారు. ఐదేళ్లలో ఒక్క రూపాయి మాఫీ చేయలేదు. ఇప్పుడు పసుపు–కుంకుమ అని భిక్షం ఇస్తున్నారు. వడ్డీకైనా ఈ పసుపు–కుంకుమ సరిపోతుందా? ఎంగిలి చేయ్యి విదిలిస్తున్నా..మోసపోవద్దు. 

చంద్రబాబు ఎప్పుడైనా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారా?
పేద విద్యార్థులకు పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వకుండా దగా చేశారు. విద్యార్థులు ఫీజులు చెల్లించలేక చదువులు మానేస్తున్నారు. ఆరోగ్యశ్రీ లిస్టు నుంచి కార్పొరేట్‌ ఆసుపత్రులను తొలగించారు. పేదలకు జబ్బు చేస్తే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని శాసిస్తున్నారు. చంద్రబాబు ఎప్పుడైనా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారా? ఇది     అమానుషం కాదా? ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇలాగేనా ఆలోచన చేసేది
పోలవరాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తానని వాగ్ధానం చేశారు. ఆయనకు మాట మీద నిలబడే నైజం లేదు. ఆయనకు చాలా అనుభవం ఉంది. రాజధాని అద్భుతంగా కట్టేస్తారని ఓట్లు వేస్తే ఒక్క ఇటుక కూడా వేయలేదు. కేంద్రం రూ.2500 కోట్లు రాజధానికి ఇచ్చారట. ఒక్క ఫ్లై ఓవర్‌ అయినా కట్టారా? అమ్మకు అన్నం పెట్టలేదు కానీ..చిన్నమ్మకు బంగారు గాజులు ఇస్తానన్నారట చంద్రబాబు తీరు కూడా అలాగే ఉఉంది. అమరావతిని అమెరికా చేస్తారట. మన చెవిలో పూలు పెడతారట..నమ్ముతారా?

జాబు ఎవరికైనా వచ్చిందా?
బాబు వస్తే జాబు వస్తుందన్నారు. ఎవరికి వచ్చింది. చంద్రబాబు కొడుక్కి లోకేష్‌కు వచ్చింది. ఒకటి కాదు. రెండు కాదు..మూడుమంత్రి పదవులు ఇచ్చారు. ఈ పప్పుగారికేమో వర్ధంతికి, జయంతికి తేడా తెలియదు. అఆలు కూడా రావు కానీ అగ్రతాంబులం నాకే అన్నారట ఒకడు. ఈ పప్పుగారు ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు. మూడు శాఖలకు మంత్రిని చేసి మన నెత్తిన పెట్టారు. ఏ అనుభవం ఉందని మంత్రిని చేశారు. మామూలు ప్రజలకు మాత్రం ఉద్యోగాలు లేవు. నోటిఫికేషన్లు లేవు.
ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ఎంత ముఖ్యం. మనకు ఉద్యోగాలు రావాలంటే హోదా అవసరం. బీజేపీతో కుమ్మక్కై హోదాను తాకట్టు పెట్టారు. ఎన్నికలకు ముందు హోదా కావాలన్నారు. అధికారంలోకి వచ్చాక ప్యాకేజీ ముద్దు అన్నారు. ఎన్నికలు వచ్చాయి కాబట్టి హోదా అంటున్నారు.

చంద్రబాబుకు దమ్ముంటే నిజం చెప్పాలి
గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు..ఇప్పుడేమో కాంగ్రెస్‌తో పొత్తు అంటున్నారు. చంద్రబాబుది రోజుకోమాట..పూటకో వేషం. నాకు రెండు నాలుకలు ఉన్నాయని చంద్రబాబు చెప్పుకుంటున్నారు.ఈయన మార్చే రంగులు చూస్తే ఊసరవెళ్లి కూడా సిగ్గుతో పారిపోవాలి. చంద్రబాబుకు దమ్ముంటే నిజం చెప్పాలి. వైయస్‌ జగన్‌ ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ నుంచి గల్లీ దాకా పోరాటం చేశారు. జగనన్న  లేకపోతే చంద్రబాబు నోట హోదా మాట వచ్చేదా? వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారు. మళ్లీ హోదా కావాలని చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారంటే అది జగనన్నే కారణం కాదా?

పిల్లి పిల్లినే..పులి పులినే..
చంద్రబాబు నెత్తిన ఒక శాపం ఉందట. నాన్నగారు చెప్పారు. ఏ రోజైతే చంద్రబాబు ఒక్క నిజం చెబుతారో చంద్రబాబు తల వెయ్యి ముక్కలు అవుతుందట. అందుకే చంద్రబాబు నిజాలు మాట్లాడరు. ఈ మధ్య చంద్రబాబు పెద్ద పెద్ద పదాలు వాడుతున్నారు. పౌరుషం, రోషం అంటున్నారు. నిజం కాకపోయినా జగన్‌ కేసీఆర్‌తో పొత్తు పెట్టుకున్నారని, నీకు పౌరుషం లేదా అంటున్నారు. హరికృష్ణ భౌతికాయం పక్కనే కేటీఆర్‌తో పొత్తు గురించి మాట్లాడారు. అప్పుడేమైంది చంద్రబాబు రోషం, పిల్లి గట్టిగా నాకు పౌరుషం ఉందని అరిచినంత మాత్రన పిల్లి పులి కాదు..పిల్లి పిల్లినే..పులి పులినే.

 సింహం ఎవరు..నక్క ఎవరు? 
వైయస్‌ జగన్‌ ఓదార్పు కోసం కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చారు. అది పౌరుషం అంటే., అది రోషమంటే. సొంత మామకు వెన్నుపోటు పొడిచి ఆయన కుర్చీని గుంజుకున్న చంద్రబాబుకు రోషం గురించి మాట్లాడే అర్హత లేదు. మాకు ఎవరితో పొత్తు లేదు. బీజేపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌తో పొత్తు అవసరం లేదు. సింహం సింగిల్‌గానే వస్తుంది. జగన్‌ వైయస్‌ఆర్‌సీపీ సింగిల్‌గానే బంపర్‌ మెజారిటీతో గెలుస్తుందని దేశంలోని సర్వేలన్నీ చెబుతున్నాయి. సింహాం సింగిల్‌గానే వస్తోంది. నక్కలే గుంపుగా వస్తాయి. సింహం

సింహం ఎవరు..నక్క ఎవరు? 
చంద్రబాబు 600 హామీలు ఇచ్చారు. ఏ ఒక్కటి నెరవేర్చలేదు. మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి కొత్త కొత్త హామీలు ఇస్తున్నారు. నిన్ను నమ్మం బాబు అనండి. మీ భవిష్యత్తు– నాబాధ్యత అంటున్నారు. ఇన్నేళ్లు ప్రజల బాధ్యత కనిపించలేదా? లోకేష్‌ ఒక్కడి బాధ్యతే కనిపించిందా? చంద్రబాబు నరరూప రాక్షసుడు. మన పప్పు లోకేష్‌ ఒక వీడియోలో చెబుతున్నారు..పొరపాటున కూడా టీడీపీకి ఓటు వేస్తే మన ఉరి మనమే వేసుకున్నట్లు అని చెబుతున్నారు. ఇంకొక వీడియోలో లోకేష్‌ చెబుతున్నారు. కులపిచ్చి, మత పిచ్చి ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీనే అట. అవునా? కాదా?

బాకీ సంగతి ఏంటని నిలదీయండి
ఎన్నికలు వచ్చాయని టీడీపీ నేతలు ఓట్లు కొనేందుకు డబ్బులతో వస్తారు. అమ్ముడపోకండి. నిజానికి వాళ్లు ఎన్ని డబ్బులు ఇచ్చినా చంద్రబాబు మీకు ఉన్న బాకీ తీరరు. చంద్రబాబు 600 హామీలు ఇచ్చారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు. ఈ ఐదేళ్లలో తల్లిదండ్రులు తమ పిల్లలకు కట్టిన ఫీజులు మీకు బాకీ పడ్డారు. ఆడపిల్లల తల్లిదండ్రులకు రూ.25 వేలు బాకీ ఉన్నారు. టీడీపీ నేతలు వస్తే ఈ బాకీ సంగతి ఏంటని అడగండి. విద్యార్థులకు ట్యాబ్‌లు ఇస్తామన్నారు. ఇంటికో ఉద్యోగం, రూ.2 వేల నిరుద్యోగ భృతి అన్నారు. ప్రతి ఇంటికి రూ.1.20 లక్షలు చంద్రబాబు బాకీ పడ్డారు. టీడీపీ వాళ్లు వచ్చి ఓటు అడిగితే ఈ బాకీ సంగతి ఏంటని అడగండి. ప్రతి పేదవాడికి 3 సెంట్ల స్థలం ఇస్తామన్నారు. మీ భూమి మీకు రాసివ్వమని అడగండి. రుణాలు మాఫీ చేస్తామన్నారు. ఆ రుణమంతా చంద్రబాబు బాకీ పడినట్లే. చంద్రబాబుకు దమ్ముంటే మీ బాకీ తీర్చాలి. మీకు ఎంత డబ్బు ఇచ్చినా చంద్రబాబు బాకీ తీర్చలేదు. బాబు వస్తే జాబు వస్తుందన్నారు. కరువు వచ్చింది. అందుకే ప్రజా తీర్పు కావాలి..బైబై బాబు..ప్రజాతీర్పు..బైబై బాబు కావాలి..

అవినీతి పోవాలంటే జగనన్న రావాలి
రాబోయే రాజ్యంలో జగనన్న ముఖ్మమంత్రి అయ్యాక రైతుకు పెట్టుబడి నిధి కింద రూ.12500 ఇస్తారు, గిట్టుబాటు ధరలకు గ్యారంటీ ఇస్తారు. ఉచిత విద్యుత్‌ ఇస్తారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తారు. సున్నా వడ్డీకే రుణాలు ఇస్తాం. విద్యార్థులకు ఎంత ఖర్చైనా ప్రభుత్వమే భరిస్తుంది. పిల్లలను బడికి పంపిస్తే రూ.15వేలు ఇస్తాం. ఆరోగ్యశ్రీలో ఏ కార్పొరేట్‌ ఆసుపత్రికైనా వెళ్లవచ్చు.ఉచితంగా వైద్యం అందిస్తాం. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ మహిళలకు రూ.75 వేలు ఆర్థిక సాయం చేస్తాం. పింఛన్లు రూ.3 వేలకు పెంచుతూ వెళ్తాం. రాజన్న రాజ్యం కావాలంటే జగనన్న రావాలి. అవినీతి పోవాలంటే జగనన్న రావాలి. కొడుక్కు మాత్రమే జాబు ఇచ్చిన వారు పోవాలంటే జగనన్న రావాలి. నరరూప రాక్షసుడు పోవాలంటే జగనన్న రావాలి. ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాజశేఖరరెడ్డిని గుండెల్లో తలుచుకోండి. ఆయన కొడుక్కు మీకు సేవ చేసుకునే అవకాశం ఇవ్వండి. వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ అభ్యర్థి కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యే అభ్యర్థి మేకాప్రతాప్‌ అప్పారావును ఆశీర్వదించాలని షర్మిలమ్మ విజ్ఞప్తి చేశారు.
 

Back to Top