రాష్ట్రవ్యాప్తంగా మహానేత వైయ‌స్ఆర్ వర్ధంతి కార్య‌క్ర‌మాలు

 అమ‌రావ‌తి:  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి వర్ధంతి కార్య‌క్ర‌మాన్ని రాష్ట్ర‌వ్యాప్తంగా నిర్వ‌హిస్తున్నారు. వైయ‌స్ఆర్ జిల్లా ఇడుపుల‌పాయ‌లో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. వైయ‌స్ఆర్‌సీపీ గౌర‌వాధ్య‌క్షురాలు  వైయ‌ఎస్‌ విజయమ్మ, వైయ‌స్‌ షర్మిల, వైయ‌స్ భారతి  కలసి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వైయ‌స్ఆర్‌ ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని మ‌హానేత‌కు నివాళులర్పించారు.  

విజ‌య‌వాడ‌:
వైయ‌స్సార్‌ వర్ధంతి సందర్భంగా విజయవాడ పోలీస్ కంట్రోల్ రూం వద్ద వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌ర‌రెడ్డి విగ్రహానికి మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌, వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.  పేదల గుండెచప్పుడు మహానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. వైయ‌స్సార్‌ ప్రవేశపెట్టిన పథకాలు వల్ల ప్రజలకు ఎంతో మేలు జరిగిందన్నారు. అందరి హృదయాలు గెలిచిన మహానేత వైయ‌స్సార్‌ అని కొనియాడారు. మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి, దేవినేని అవినాష్, కాపు కార్పోరేషన్ చైర్మన్ అడపా శేషు, దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ తదితరులు పాల్గొన్నారు.

ఆరేళ్లలోనే వైయ‌స్సార్‌ 60 ఏళ్ల ప్రగతి...
రాజన్న పాలన ఒక స్వర్ణయుగం అని వైయ‌స్సార్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి వైయ‌స్సార్‌ బాటలు వేశారన్నారు. ఆరేళ్లలోనే వైయ‌స్సార్‌ 60 ఏళ్ల ప్రగతి చూపారన్నారు.

అనంత‌పురం జిల్లా:
అనంతపురం జిల్లా పుట్టపర్తి వైయ‌స్సార్ సీపీ కార్యాలయంలో మహానేత వైయ‌స్సార్ 12 వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. వైయ‌స్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైయ‌స్సార్‌ వర్ధంతి సందర్భంగా ఓడిసి మండలం గౌనిపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. మారాలలో అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే దుద్దు కుంట,  వైయ‌స్ఆర్‌సీపీ ఓడీసీ మండ‌ల అధ్య‌క్షుడు శ్రీ‌నివాస‌రెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

వైయ‌స్సార్ జిల్లా: 
ప్రొద్దుటూరు మైదుకూరు రోడ్డు లో దివంగత వైయ‌స్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా వైయ‌స్సార్‌ విగ్రహానికి ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోరుమామిళ్లలోని వైయ‌స్సార్ విగ్రహానికి పార్టీ మండల కన్వీనర్ సీఎం భాష, జిల్లా అగ్రి గోల్డ్ బాధితుల బాసట కమిటీ అధ్యక్షుడు చిత్తా విజయ్ ప్రతాప్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నాగార్జున రెడ్డి, పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులు అర్పించాయి. 

క‌ర్నూలు:
మ‌హానేత వైయ‌స్ఆర్ వర్ధంతి కార్య‌క్ర‌మం జిల్లావ్యాప్తంగా నిర్వ‌హించారు. న‌ల్ల‌కాల్వ స‌మీపంలోని వైయ‌స్ఆర్ స్మృతివ‌నంలో వైయ‌స్ఆర్‌సీపీ నంద్యాల పార్ల‌మెంట్ జిల్లా అధ్య‌క్షుడు శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి ఆధ్వ‌ర్యంలో మ‌హానేత విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. మ‌హానేత సేవ‌ల‌ను పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు స్మ‌రించుకున్నారు.

విశాఖ‌:
విశాఖలో వైయ‌స్సార్ వ‌ర్ధంతి కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మ‌హానేత విగ్ర‌హానికి వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీ‌నివాస్‌, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొని నివాళుల‌ర్పించారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top