తాడేపల్లి: “మన ఆలోచనలను సరిచేసుకుంటే, మన జీవితం మారుతుంది” అనే మహోన్నత సందేశాన్ని ప్రపంచానికి అందించిన గౌతమ బుద్ధుడి బోధనలు నేటికీ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. బుద్ధ పూర్ణిమ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా వైయస్ జగన్ తన సందేశాన్ని పంచుకున్నారు. బుద్ధుడు చెప్పిన ఆలోచనా శుద్ధి, అహింస, దయ, కరుణ వంటి విలువలు మనిషి జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయని ఆయన పేర్కొన్నారు. మనసును శాంతితో నింపుకుని, సత్య మార్గంలో నడిస్తే వ్యక్తిగతంగా మాత్రమే కాదు సమాజం మొత్తం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ పవిత్ర దినాన బుద్ధుని ఉపదేశాలను ఆచరణలో పెట్టి శాంతి, సామరస్యంతో ముందుకు సాగాలని ప్రజలను ఆయన కోరారు.