తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ రేపు (13.08.2026) కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు కర్నూలు ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి పంచలింగాల వద్ద ఉన్న జిల్లా జైలుకు వెళ్లనున్నారు. అక్రమ కేసులో అరెస్టై జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని ములాఖత్‌లో కలిసి వైయస్ జగన్ పరామర్శించనున్నారు. ఆయనకు ధైర్యం చెప్పి, ప్రస్తుత పరిస్థితులపై మాట్లాడనున్నారు. పర్యటన అనంతరం మధ్యాహ్నం కర్నూలు నుంచి తిరుగు ప్రయాణమవుతారు.