చంద్రబాబుతో పొత్తుకు అన్ని పార్టీలకు భయమే! 

ముమ్మిడివరం సభలో వైయస్‌ జగన్‌

రావణాసురుడికి పది తలలుంటే..నారాసురుడికి విడివిడిగా ఉంటాయి

వీరి లక్ష్యం ఒక్కటే..కుట్రలు, కుతంత్రాలు

పాలన చూసి ఓట్లేయాలని అడిగే పరిస్థితి చంద్రబాబుకు లేదు

అందుకే బాబు ఢిల్లీ నుంచి నేతలను రప్పించి అబద్ధాలు చెప్పిస్తున్నారు

వైయస్‌ఆర్‌ చేయూత కింద మహిళలకు రూ.75 వేలు ఇస్తాం

పిల్లలను బడికి పంపిస్తే ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు

 

 

తూర్పుగోదావరి:  చంద్రబాబుతో పొత్తు అంటేనే మిగతా పార్టీలన్నీ కూడా భయపడుతున్నాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు తన పాలనను చూపించి ఓట్లు అడిగే పరిస్థితి లేదన్నారు. రావణాసురుడికి పది తలలు ఉన్నట్లు చంద్రబాబుకు కూడా విడివిడిగా తలలు ఉన్నాయని..వీరి లక్ష్యం ఒక్కటే అని..చంద్రబాబుపై చర్చ జరుగకూడదని కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారన్నారు. ఈ పదిహేను రోజుల్లో ఇలాంటి మోసాలు, అబద్ధాలు ఎన్నో చెబుతారని చెప్పారు.  ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..

  • 3468 కిలోమీటర్ల పాదయాత్ర చేశానంటే మీ అందరి అభిమానమే. నా పాదయాత్ర ఈ నియోజకవర్గం గుండా వెళ్లినప్పుడు మీ కష్టాలను చూశాను. మీ బాధలు విన్నాను. మీర న్న ఆ మాటలు గుర్తున్నాయి. మత్స్యకార కుటుంబాలకు ఇస్తామన్న పరిహారం ఇవ్వకుండా కేవలం ఆరు నెలలు మాత్రమే చెల్లించారని, ఇంకా రూ.130 కోట్లు చెల్లించకపోగా, కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం అడగలేదన్న మీ మాటలు నాకు గుర్తున్నాయి. 
  •  ఇదే నియోజకవర్గంలో ప్రయాణం చేస్తుండగా మీరు అన్న మాటలు గుర్తున్నాయి. పక్కనే గోదావరి ఉంది కానీ, 60 గ్రామాలకు తాగునీరు లేదని చెప్పారు. ఇక్కడే వరి పండిస్తారు. రూ.1750 మద్దతు ధర ఉంది. కానీ బస్తాకు రూ.1000 కూడా రావడం లేదని చెప్పిన సంగతి మర్చిపోలేదు. పంట చేతికి వచ్చేసరికి రేట్లు పడిపోతున్నా ..ఈ ప్రభుత్వం పట్టించుకోలేదన్న మాటలు గుర్తున్నాయి.
  •  గోదావరి ప్రవహించే ఈ నేలపై నీరు అందదు. పెట్రోల్‌ పుష్కలంగా లభిస్తున్న ఇక్కడి ప్రజల తలరాత మారడం లేదు. ఇదే విషయాలు, కథలు, ఇవే బాధలు ఆ రోజు నా పాదయాత్ర గుండా వెళ్తున్నప్పుడు విన్న మాటలు. మీ అందరికి నేను ఒక్కటే చెబుతున్నాను. మీ చెప్పే మాటలు విన్నాను. మీ బాధలు  అర్థం చేసుకున్నారు. ఈ వేదికగా చెబుతున్నాను. నేనున్నానని కచ్చితంగా చెబుతున్నాను. 
  •  చిన్నప్పుడు మనం అంతా కూడా మహాభారతం, రామాయణం వంటి కథలు వినేఉంటాం. రావణాసురుడికి 10 తలలు ఉంటే ఇక్కడ నారాసురుడి గురించి వింటుంటే చంద్రబాబుకు మాత్రం విడివిడిగా తలలు ఉంటాయి. చంద్రబాబుకు ఒక తల తన నెత్తిపై ఉంటుంది. ఇంకొక తల తన పెయిడ్‌ యాక్టర్‌పై ఉంటుంది. ఒక్కోక్క తల ఈనాడు దినపత్రిక యజమాని తల ఉంటుంది. చంద్రబాబు తోక పత్రిక రూపంలో మరో తల ఉంటుంది. ఎల్లోమీడియా రూపంలో ఇంకొక తల ఉంటుంది. రాజ్యంగ వ్యవస్థలను పెట్టుకొని తన మనుషులను నింపేచోట ఇంకొక తల ఉంటుంది. మన పార్టీ కండువాలతో కూడి, మన గుర్తు మాదిరిగానే హెలికాప్టర్‌ గుర్తును పెడుతారు. అక్కడ ఒక తల ఉంటుంది. ఇక్కడి నాయకులు సరిపోరని ఢిల్లీ నుంచి నాయకులను తెచ్చుకొని తల పెడుతారు. వీరందరిది ఒకటే డైలాగ్‌. వీరందరి లక్ష్యం ఒక్కటే. చంద్రబాబు ఐదేళ్ల దుష్టపరిపాలనపై చర్చ జరుగకూడదు. మోసపు పాలన గురించి చర్చ జరిగితే చంద్రబాబుకు డిపాజిట్లు కూడా రావని వీరికి తెలుసు. వీరందరి కోరిక, కుట్ర ఒక్కటే. నిజాలపై చర్చ జరుగకూడదన్నదే వీరి లక్ష్యం. చంద్రబాబు వాగ్ధానాలపై చర్చ జరుగకూడదన్నదే వీరి ఉద్దేశం. మనం ఇటీవల టీవీ ఆన్‌ చే సినా..చంద్రబాబు పార్ట్‌నర్‌..యాక్టర్‌ మాటలు వింటే చాలు మన దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారు. వీరే హత్యలు చేస్తారు. దాన్ని వక్రీకరిస్తూ వీళ్లే వార్తలు రాస్తారు. వీరే విచారణ చేయిస్తారు. ఇంతటి దారుణంగా ఇవాళ చంద్రబాబు ..ఆయన పార్ట్‌నర్‌లు చేస్తున్న రాజకీయాలు చూస్తే బాధనిపిస్తుంది. వీళ్లు రోజుకో పుకార్లు పుట్టిస్తారు. దానిపై చర్చ జరగాలి. వీళ్లంతకు వీళ్లు అన్యాయమైన రాజకీయాలు చేస్తారు. ఎదుటి వారు ఎవరితో పొత్తు పెట్టుకున్నారు అన్నదానిపై చర్చలు జరుపుతారు. చంద్రబాబు ఈ 20 రోజులు ఎలా మభ్యపెట్టాలని ఆలోచన చేస్తారు. 
  •  చంద్రబాబు పాలనను ఒకసారి చూడండి. రైతుల రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఐదేళ్లలో రుణాలు మాఫీ చేశాడా? కనీసం వడ్డీలు కూడా మాఫీ కాలేదు. అరకొరగా ఇచ్చేది కూడా సకాలంలో ఇవ్వడం లేదు. ఎన్నికల రోజు వరకు పెండింగ్‌లో పెట్టారు. ఎన్నికలకు వారం రోజుల ముందు నాలుగో విడతలకు నిధులు కేటాయిస్తున్నారు. ఎంత దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారో గమనించండి, కనీసం రెండేళ్ల క్రితం ఇచ్చి ఉంటే రైతులు చేసిన అప్పులపై వడ్డీలన్నా మిగిలేవి.
  •  చంద్రబాబు పార్టనర్‌ గురించి చెబుతా..చంద్రబాబు తన పార్ట్‌నర్‌ బాగా మాట్లాడుతున్నారట. కేసీఆర్‌–జగన్‌కు మధ్య ఉన్న సంబంధాన్ని పార్ట్‌నర్‌ బాగా మాట్లాడుతున్నారని చంద్రబాబు పొగుడుతారు. ఇదే పార్ట్‌నర్‌ నామినేషన్‌ వేస్తారు. అక్కడ కనిపించేది టీడీపీ జెండాలు. నాలుగేళ్లు ఇదే పార్ట్‌నర్‌ చంద్రబాబుతో కలిసి కాపురం చేస్తారు. ఏడాదికి ముందు విడిపోయినట్లు డ్రామాలు ఆడుతారు. చంద్రబాబు వైయస్‌ జగన్‌పై 22 కేసులు పెట్టారు. రాజధాని రైతులకు తోడుగా ఉన్నందుకు 8 కేసులు పెట్టారు. ప్రతి ఉద్యమంపై కేసులు పెట్టారు. 
  •  చంద్రబాబు తన యాక్టర్‌పై ఎన్ని కేసులు పెట్టారో తెలుసా? అక్షరాల సున్నా..అంటే వీళ్ల డ్రామాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఒక్కసారి గమనించండి. చంద్రబాబు పరిపాలన ఏ స్థాయిలో ఉందంటే..ఆయనపై ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందంటే..చివరకు తన యాక్టర్‌తో నేరుగాపొత్తు పెట్టుకోలేని దుస్థితి. ఇది నా పాలన అంటూ ఓట్లు అడిగే ధైర్యం చంద్రబాబుకు లేదు. చంద్రబాబు బ్రహ్మండంగా పాలన చేశారని చెప్పుకుని ఓట్లు అడిగే ధైర్యం కూడా ఆయన పార్ట్‌నర్‌కు లేదు. ఆయనతో పోరాటం చేస్తున్నట్లు ఈ పార్ట్‌నర్‌ మనందరిని మభ్యపెడుతున్నారు.
  •  చంద్రబాబుతో నేరుగా పొత్తు పెట్టుకోవాలంటే ¿¶ యపడుతున్నారు. కమ్యూనిస్టులు డైరెక్టుగా పొత్తు పెట్టుకోవాలంటే భయపడుతున్నారు. నిన్న చంద్రబాబు ఢిల్లీ నుంచి ఫరూక్‌ అబ్ధుల్లాను తీసుకువచ్చి నాపై  అబద్ధాలు చెప్పించారు. ఈ 15 రోజుల్లో ఇంకా అబద్ధాలు చెబుతారు..ఇంకా అన్యాయాలు చేస్తారు. ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చెబుతారు.
  • రాబోయే రోజుల్లో  ఇదే పెద్ద మనిషి ఎన్నికల్లో గెలవడం కోసం చెప్పని అబద్ధం, దుర్మార్గం ఉండదు. ఆయన చేస్తున్న అన్యాయాల్లో ఒక అడుగు ముందుకు వేసి ప్రతి గ్రామానికి మూటలు మూటలుగా డబ్బులు పంపిస్తారు. ప్రతి ఒక్కరి చేతిలో రూ.3 వేలు డబ్బులు పెడతారు. మీరంతా కూడా మీ వార్డుల్లోకి వెళ్లాలి. ప్రతి ఒక్కరిని కలవండి. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దు. 20 రోజులు ఓపిక పడితే అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. మన పిల్లలను బడికి పంపిస్తే చాలు ఏడాదికి రూ.15 వేలు ఇస్తారని చెప్పండి.
  •  రూ.3 వేలకు మోసపోవద్దని ప్రతి ఒక్కరికి చెప్పండి. మన పిల్లలను ఇవాళ ఉన్నత చదువులు చదివించే పరిస్థితిలో ఉన్నామా అని ఆ అక్కను అడగండి. ఫీజులు లక్షల్లో ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం అరకొరగా  ఇస్తుంది. మన పిల్లలను చదివించాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోంది. 20 రోజులు ఓపిక పడితే అన్న ముఖ్యమంత్రి అవుతారు. మన పిల్లలను ఇంజినీర్లు, డాక్టర్లుగాను ఎన్ని లక్షలు ఖర్చైనా అన్నే భరిస్తారని చెప్పండి. 
  •  పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కను, చెల్లెమ్మను కలవండి. అక్క ఐదేళ్లు చంద్రబాబును చూశాను. రుణాలు మాఫీ చేస్తామని ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు. ఈ పెద్ద మనిషి సీఎం అయ్యాక సున్నా వడ్డీ రుణాలు ఎగురగొట్టారు. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న సీఎం అయ్యాక పొదుపు సంఘాల్లో ఉన్న అక్కచెల్లెమ్మలకు ఎంతైతే అప్పు ఉందే అడబ్బంతా నేరుగా నాలుగు దఫాల్లో మీ చేతికే ఇస్తారని చెప్పండి. అన్న సీఎం అయ్యాక మళ్లీ బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తారు. సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తారని చెప్పండి.
  • ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనారిటీ అక్కలకు చెప్పండి. 45 ఏళ్లు వయసులో పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పండి. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం..ఆ తరువాత వైయస్‌ఆర్‌ చేయూత పథకాన్ని అన్న తెస్తారు. ప్రతి ఒక్కరి చేతిలో రూ.75 వేలు ఉచితంగా ఇస్తారని చెప్పండి.
  •  ప్రతి రైతు వద్దకు వెళ్లండి. చంద్రబాబు ఇచ్చే రూ.20 వేలకు మోసపోవద్దు. చంద్రబాబు ఎన్నికలకు ముందు రుణాలు మాఫీ చేస్తామని మోసం చేశాడు. ఏ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర రావడం లేదని చెప్పండి. 20 రోజులు ఓపిక పడితే అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. ఆ తరువాత రైతులకు పెట్టుబడి కోసం మే మాసంలోనే ప్రతి ఏటా రూ.12500  ఇస్తారు. ఏకంగా రూ.50 వేలు మన చేతికే ఇస్తారని చెప్పండి. ఏ బ్యాంకు కూడా ఈడబ్బు కత్తరించడు అని చెప్పండి.గిట్టుబాటు ధరలకు అన్న గ్యారెంటీ ఇస్తారని చెప్పండి
  •  ప్రతి అవ్వ, తాత వద్దకు వెళ్లి చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని చెప్పండి. ఎన్నికలకు ముందు రెండు నెలల కిందట పింఛన్‌ ఎంతిచ్చేవారు అని అడగండి. ఇవ్వలేదని కానీ, లేదా రూ.1000 ఇచ్చేవారు అని చెబుతారు. జగనన్న రూ.2 వేలు ఇస్తామని చెప్పకపోతే చంద్రబాబు ఇచ్చేవారా? ప్రతి ఒక్కరికి చెప్పండి. 20 రోజులు ఓపిక పట్టండి. ఆ తరువాత మీ మనువడు ముఖ్యమంత్రి అవుతారు. ఆ తరువాత పింఛన్‌ రూ.3 వేల వరకు పెంచుతూ పోతారని చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశాన్ని చెప్పండి.
  •  చంద్రబాబు పాలనలో ఉద్యోగాలు రాలేదు. అన్నకు  ఒక్క అవకాశం ఇద్దాం. అన్న సీఎం అయ్యాక ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారు. ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయాలు తెరుస్తారు. అదే గ్రామాల్లో పది మందికి ఉద్యోగాలు ఇస్తారని చెప్పండి.
  •  ఇల్లులేని ప్రతి నిరుపేదకు ఇల్లు కట్టిస్తారని చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి ఒక్కరికి తెలియాలి. నవరత్నాలతో జీవితాలు బాగుపడుతాయి. ఆ నవరత్నాల్లో చెప్పిన ప్రతి అంశాన్ని కూడా తూచా తప్పకుండా అమలు చేస్తానని గట్టిగా చెబుతున్నాను. ఈ చెడిపోయిన వ్యవస్థలో మార్పు కోరుతూ ముమ్మడివరం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా సతీష్‌కుమార్‌ నిలబడ్డారు. ఎంపీగా చింతా అనురాధ ఉన్నారు. వీరిద్దరిని మీరందరూ ఆశీర్వదించాలని పేరు పేరున ప్రార్థిస్తున్నాను. మన గుర్తు ఫ్యాన్‌.. అందరికి చెప్పండి అంటూ విజ్ఞప్తి చేశారు.

తాజా వీడియోలు

Back to Top