తిరుపతి జిల్లా రోడ్డు ప్రమాదంపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి

తిరుపతి జిల్లా: పుల్లంపేట మండలం ఉడుమువారిపల్లె వద్ద ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో చిన్నారి పునీత్ సాయి, విద్యార్థిని యశ్విత మృతి చెందడం అత్యంత విషాదకరమని మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందని ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ తీరని విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని వారికి దేవుడు ప్రసాదించాలని ప్రార్థించారు.

అదేవిధంగా ఈ ప్రమాదంలో గాయపడిన వారందరికీ అత్యవసరంగా మెరుగైన వైద్య సేవలు అందించి, వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని శ్రీ వైయస్ జగన్ కోరారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిచి, తగిన సహాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.

Back to Top