సత్యనిష్ఠ సత్ప్రవర్తనకు ప్రతీక రంజాన్ : వైఎస్‌ జగన్‌

ముస్లిం సోద‌ర‌,సోద‌రీమ‌ణుల‌కు సీఎం శుభాకాంక్ష‌లు

అమరావతి :  రంజాన్ పండగ సందర్బంగా ముస్లిం సోదర, సోదరిమణులకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దీక్షలు, ఉపవాసాలు, దైవారాధన, దానధర్మాలు, చెడును త్యజించడం, మానవులకు సేవ వంటి సత్కార్యాల ద్వారా భగవంతుని స్మరణలో తరించే ఈ రంజాన్ రాష్ట్ర ప్రజలకు సుఖసంతోషాలు కలిగించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. పవిత్ర ఖురాన్ గ్రంథం దివి నుంచి భువికి దిగివచ్చిన శుభ సమయం ‘రంజాన్ . నమాజ్, కలిమా, రోజా, జకాత్, హజ్ అనే ఐదు అంశాలతో భగవంతునికి కృతజ్ఞతలు తెలిపే ఈ సందర్బంగా ముస్లిం సోదర సోదరీమణులకు సీఎం వైఎస్ జగన్ ఆత్మీయ శుభాభినందనలు తెలిపారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ప్రజలకు అల్లా దయ ఎల్లప్పుడూ ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన సందేశంలో పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top