తాడేపల్లి: మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదికవి వాల్మీకి మహర్షికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా స్పందిస్తూ, వాల్మీకి మహర్షి రచించిన రామాయణం భారతీయ సంస్కృతికి అమూల్యమైన సాహిత్య సంపదగా నిలిచిందని కొనియాడారు. సత్యం, ధర్మం, న్యాయం, మానవీయ విలువల గొప్పతనాన్ని రామాయణ మహాకావ్యం ద్వారా ప్రపంచానికి చాటిచెప్పిన మహర్షి వాల్మీకి సేవలు చిరస్మరణీయమని వైయస్ జగన్ పేర్కొన్నారు. మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.