బాబూ జగ్జీవన్ రామ్‌కు వైయ‌స్ జగన్‌ నివాళి 

తాడేపల్లి: బాబూ జగ్జీవన్ రామ్‌కు వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ‘‘అణగారిన వర్గాల ఆత్మగౌరవం. సమాన అవకాశాల కోసం జీవితాంతం అలుపెరుగని కృషి చేసిన మహనీయుడు, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్. వ్యవసాయం, రక్షణ రంగాల బలోపేతంతో పాటు దేశ ప్రగతికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. నేడు డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా నివాళులు’’ అంటూ వైయ‌స్‌ జగన్‌ ట్వీట్‌  చేశారు. 

Back to Top