రేపు వైయస్ జగన్ మోహన్ రెడ్డి నామినేషన్

హైదరాబాద్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన నామినేషన్ ను  ఈ నెల 22 వ తేదీ శుక్రవారం దాఖలు చేయనున్నారు.

మేనిఫెస్టో కమిటీ సమావేశం

పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కు తుది రూపు ఇచ్చే నిమిత్తం గురువారం నాడు మేనిఫెస్టో కమిటీ సభ్యులతో  వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశం అవుతున్నారు ఈ సమావేశంలో మేనిఫెస్టో తుది ముసాయిదాపై కసరత్తు జరగనుంది. ఈ కారణంగా గురువారం జగన్‌ ఎన్నికల ప్రచారానికి విరామం ఇచ్చినట్టు పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top