రాక్షసులతో మనం యుద్ధం చేస్తున్నాం 

మీకు తగిలిని ప్రతీ గాయం నా గుండెకు తాకింది

ఎన్ని కష్టాలు భరించారో నాకు తెలుసు

దొంగ కేసులు పెడుతున్నారు..లాఠీ దెబ్బలు తిన్నారు

మీలో ప్రతీ ఒక్కర్ని నేను చూసుకుంటాను

రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా పైకి తెచ్చుకుంటాను

59 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయి

అన్నొస్తాడ‌ని అంద‌రికీ చెప్పండి..

అనంతపురం: అన్యాయానికి ప్రతిరూపంగా ఉన్న వాళ్లతో, రాక్షసులతో మనం యుద్ధం చేస్తున్నామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మన పోరాటం ఒక్క చంద్రబాబుతో మాత్రమే కాదని, ఎల్లోమీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 ఇలా అనేక చానళ్లతో పోరాటం చేస్తున్నామని, మోసగాళ్లతో యుద్ధం చేయాలన్నారు. వైయస్‌ఆర్‌సీపీకి అనుకూలంగా ఉన్నవాళ్ల ఓట్లు తొలగిస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైయ‌స్ జ‌గ‌న్ ఏమ‌న్నారంటే..ఆయ‌న మాట‌ల్లోనే..

తొమ్మిది సంవత్సరాలుగా నాతోపాటు నడిచారు. తొమ్మిది సంవత్సరాలుగా నాకు అండగా నిలిచారు. తొమ్మిదేళ్ల నుంచి ప్రతిపక్షంలోనే ఉన్నాం. అధికారంలో ఉన్నవాళ్లు కష్టాలు పెట్టారు. బాధలు పెట్టారు. మీరు పడిన కష్టాలు నాకు తెలుసు. మీకు జరిగిన నష్టాలు నాకు తెలుసు. ఇక్కడకు వచ్చిన మీరు గానీ, 13 జిల్లాలోని మన పార్టీ నాయకులు, కార్యకర్తలు తొమ్మిదేళ్లుగా ఎలా ఉన్నారో నాకు తెలుసు. కొందరు కేసులను భరించారు. అవమానాలను సహించారు. లాఠీ దెబ్బలు తిన్నారు. ఆస్తులు పోగొట్టుకున్నారు. కొందరు కుటుంబ సభ్యులను కూడా పోగొట్టుకున్న పరిస్థితులను చూశా.. మీ ప్రతి కష్టాన్ని, నష్టాన్ని చూశా. మీకు తగిలిన ప్రతి గాయం నా గుండెకు తాకింది. మీలో ప్రతి ఒక్కరిని నేను చూసుకుంటాను. మీ బాగోగులు చూసుకుంటాను. రేపు పొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లన దీవెనలు, ప్రజల ఆశీసులతో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని రకాలుగా మీ బాగోగులు చూసుకుంటాను. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా మిమ్మల్ని పైకి తెచ్చుకుంటాను. మీపై పెట్టిన దొంగ కేసులు. ఐదేళ్లలో 1280 మందిపై అక్రమ కేసులు బనాయించారని రాప్తాడు ప్రకాష్‌రెడ్డి చెప్పారు. అన్ని దొంగ కేసులు అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపసంహరించే కార్యక్రమం చేస్తా. 

దేవుడి ఆశీర్వదించి, మీ అందరి దీవెనలతో, ప్రజల ఆశీసులతో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఒక్కరికి అందాలి. కులం చూడొద్దు, మతం చూడొద్దు. ప్రాంతం, వర్గం చూడొద్దు, రాజకీయాలు, పార్టీలు చూడకూడదు. అవినీతి లేని స్వచ్ఛమైన పాలన ప్రతి పేదవాడికి అందాలి. ఈ కార్యక్రమాల్లో క్రియాశీలక పాత్ర పోషించేది మీరే. ఎన్నికలు దగ్గరపడ్డాయి. ఈ నెలాఖరులో షెడ్యుల్‌ వస్తుందంటున్నారు. ఆ తరువాత నెల, నెలన్నరలో ఎన్నికలు జరగబోతాయి. అంటే ఈ రోజు నుంచి దాదాపు మూడు నెలల లోపే ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల దగ్గరపడుతున్న సమయంలో మీ అందరిపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత మీ అందరి భుజస్కంధాలపై ఉంది. 

మనం రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం. అన్యాయానికి ప్రతిరూపంగా ఉన్న వారితో యుద్ధం చేస్తున్నాం. మోసగాళ్లతో పోరాడుతున్నామని ఎవరూ మర్చిపోలేదు. ఎన్నికలు వచ్చే సరికి ఓటర్‌ లిస్టులో పేర్ల తొలగింపు కార్యక్రమాలు జరగుతున్నాయి. వైయస్‌ఆర్‌ సీపీకి అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగించే కార్యక్రమం చూస్తున్నారు. అప్రమత్తంగా ఉండండి. ఓటర్‌ లిస్టును మీరంతా సరిచేసుకోవాలి. ప్రతి గ్రామంలో మన మీద అభిమానం చూపించే  వారంతా ఓటర్లుగా ఉన్నారా లేరా అని మరోసారి చూసుకోండి. ఓటర్లుగా మన పేర్లు తొలగించిన పరిస్థితి ఉంటే ఫామ్‌–6ను నింపి వారిని జాబితాలో చేర్చే విధంగా చూడాలి. 

రాష్ట్రంలో అక్షరాల 59.18 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని గమనించాలి. ఆ బోగస్‌ ఓట్లలో తెలంగాణలో 20 లక్షలు ఉంటే.. మిగిలిన 39 లక్షలు మన రాష్ట్రంలోనే ఒకొక్కరికి రెండు ఓట్లు ఉన్నాయి. ఆ మొత్తం దొంగ ఓట్లను మనమంతా తొలగించే కార్యక్రమం చేయాలి. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి, మన పార్టీ మధ్య తేడా కేవలం 5 లక్షలు మాత్రమే మీరంతా మర్చిపోవద్దు. అందరూ అప్రమత్తంగా ఉండి. దొంగ ఓట్లు ఉన్న చోట ఓట్లు తొలగించే కార్యక్రమం చేయాలి. మన సానుభూతి పరుల ఓట్లను తొలగించి ఉంటే వాటిని నమోదు చేసే కార్యక్రమంలో ముందుండాలి. 

అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాలి
టీడీపీ వ్య‌తిరేక ఓట్ల‌ను తొలగించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మనం పోరాటం చేస్తోంది ఒక చంద్రబాబు నాయుడుతోనే కాదు. చంద్రబాబుకు సంబంధించిన ఎల్లో మీడియాతో కూడా పోరాటం చేస్తున్నాం.ఈనాడు,ఆంధ్రజ్యోతి,టీవీ 5,అనేక టీవీ ఛానెల్స్‌తో పోరాటం చేస్తున్నాం. ఎల్లో మీడియా చంద్రబాబను భూజాన ఎత్తుకుని పనిచేస్తోంది.చంద్రబాబు  అబద్ధాలను మోసాలను మోయడానికే వారంతా ఉన్నారు. వారందరితో యుద్ధం చేస్తున్నాం. ఎన్నికల సమీపంలో చంద్రబాబు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తారు.గ్రామాలకు చేరుతాయి.చంద్రబాబు ప్రతి ఓటరు చేతిలోనూ మూడువేల రూపాయలు డబ్బులు చేతిలో పెట్టే కార్యక్రమం చేస్తాడు. అన్న ముఖ్యమంత్రి అయినతర్వాత మన పిల్లలను కేవలం బడికి పంపిస్తే చాలు అమ్మఒడి పథకం ద్వారా సంవత్సరానికి రూ.15 వేలు ఇస్తాడు అని చెప్పండి.

మోస‌పోవ‌ద్ద‌ని చెప్పండి
చంద్ర‌బాబు ఇచ్చే మూడువేల రూపాయలకు మోసపోవద్దు అని గట్టిగా చెప్పండి..ప్రతి  అమ్మకు,అక్కకు,చెల్లికి చెప్పండి.. చంద్రబాబు ఇచ్చే మూడువేల రూపాయలకు మోసపోవద్దండి..రేపు అన్న ముఖ్యమంత్రి అవుతాడు. అన్న చేయూత అనే కార్యక్రమం తీసుకువస్తాడు..ప్రతి ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ ప్రతి అక్కాచెల్లెమ్మలకు నలభైఐదు సంవత్సరాలు వయస్సు నిండితే చాలు.. నాలుగు దఫాలుగా అన్న రూ. 75 వేలు చేతిలో పెడతాడు అని చెప్పండి..చంద్రబాబు ఇచ్చే మూడువేల రూపాయాలకు మోసపొవద్దు అని చెప్పండి. రేపు అన్న ముఖ్యమంత్రి అవుతాడు..పొదుపు సంఘాల్లో ఉన్న అక్కాచెల్లెమ్మలకు ఎన్నికల నాటికి ఎంతఅయితే అప్పుగా రుణాలు ఉంటాయో మొత్తం రుణాలు అన్ని నాలుగు దఫాలుగా నేరుగా మీ చేతిల్లోనే పెడతాడన్నా అని చెప్పండి..ప్రతి అక్కాకు చెప్పండి..ప్రతి అవ్వాకు చెప్పండి. ప్రతి అమ్మకు చెప్పండి..చంద్రబాబు ఇచ్చే మూడువేల రూపాయలకు మోసపోవద్దండి..

అన్న ముఖ్య‌మంత్రి అవుతాడ‌ని చెప్పండి 
రేపు అన్న ముఖ్యమంత్రి అవుతాడు..పెన్షన్లు రెండువేలు నుంచి మూడువేలు వరుకు పెంచుకుంటూ వెళ్తాడు అని చెప్పండి...మన పిల్లలు ఇంజనీర్లు,డాక్టర్లు, కలెక్టర్‌ వంటి పెద్ద పెద్ద చదువులు చదువుతారు.ఆ చదువులు కోసం ఎన్ని లక్షలు అయినా పర్వాలేదు అన్న చూసుకుంటాడు అని చెప్పండి...రేపు అన్న ముఖ్యమంత్రి అవుతాడు.. ముఖ్యమంత్రి అయినతర్వాత  ఇంట్లో ఎవరికి బాగోలేకపోయినా లక్షల రూపాయాలు ఖర్చయే ఆపరేషన్‌ అయినా పర్వాలేదు.రేపు అన్న ముఖ్యమంత్రి అయితే చాలు మన వైద్యం ఖర్చు 1000 రూపాయలు దాటితే చాలు ఎన్ని లక్షలయినా అన్న ఖర్చుచేసి వైద్యం చేయిస్తాడు అని ప్రతి అన్నకు చెప్పండి. నవరత్నాలోని ప్రతి అంశం విపులంగా ప్రతి అక్కకు,చెల్లికి,అమ్మ కు విపులంగా చెప్పండి.చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇస్తామన్న మూడువేల సొమ్మును మోసపోవద్దు అని చెప్పండి..ఆ ఇచ్చే మూడు వేల రూపాయలు కూడా చంద్రబాబు ఎలా ఇస్తాడో తెలుసా..ఆ డబ్బు ఇచ్చేటప్పుడు చంద్రబాబును ప్రజలను నమ్మరు..ఎందుకంటే చంద్రబాబు ప్రజలకు చేసిందేమి లేదు.కాబట్టి ఏమిచేస్తాడో తెలుసా.. ఆ మూడు వేల రూపాయలు చేతిలో పెడుతూ దేవుడి మీద ప్రమాణం చేయించుకునే కార్యక్రమం కూడా చేస్తాడు. మీ అందరికి ఒకటే చెబుతున్నా..చంద్రబాబు మూడు వేలు ఇస్తే వద్దు అన్నొద్దు..కుదరదు..కనీసం ఐదువేల కావాలని అడగండి.డబ్బులు తీసుకోండి..తీసుకునేటప్పుడు ఒక సెకను దేవుని తలుచుకోండి. ఈ రాక్షసుడికి ఓట్లు వేయం అని మనసులో చెప్పుకోండి

సీ విజిల్‌ యాప్‌ను ఉపయోగించుకుందాం
ఎన్నికలు దగ్గరకు వచ్చే సరికి చంద్రబాబు రోజుకో డ్రామా, రోజుకో సినిమా చూపిస్తున్నాడు. ఎన్నికల కమిషన్‌ సీ విజిల్‌ అని యాప్‌ తయారు చేసింది. ప్రతి కార్యకర్తకు ఒక్కటే చెబుతున్నా. మీ ఫోన్లలో ఆ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి. ఈ యాప్‌ ఎలక్షన్‌ కమిషన్‌కు సంబంధించింది. తెలుగుదేశం పార్టీ వారు ఎటువంటి అన్యాయమైన కార్యక్రమాలు చేస్తున్నా.. ఫోన్లలో రికార్డు చేసి సీ విజిల్‌ యాప్‌ ద్వారా ఎలక్షన్‌ కమిషన్‌కు పంపించండి. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం రిటర్నింగ్‌ అధికారి వంద నిమిషాల్లో దీనిపై నివేదిక ఇవ్వాల్సిన బాధ్యత ఉందని ఈసీ చట్టంలోనే ఉంది. రేపు పొద్దున మీ గ్రామంలోకి ఎవరైనా వచ్చి అన్యాయంగా ఏమైనా చేస్తావుంటే సీ విజిల్‌ యాప్‌ ద్వారా ఎన్నికల కమిషన్‌కు నేరుగా పంపించాలి. ఎన్నికల్లో ప్రతి ఊరిలో ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అవ్వకు, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి చంద్రబాబు నాయుడు చేస్తున్న మోసాల గురించి, మభ్యపెట్టే సినిమాల గురించి చెప్పాలి. 

 
 

 

Back to Top