ఆర్మీ జవాన్ కార్తీక్ మృతికి వైయ‌స్ జగన్ సంతాపం 

తాడేపల్లి : జమ్మూకశ్మీర్‌లోని సొపోర్‌ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆర్మీ జవాను పంగాల కార్తీక్ మృతి ప‌ట్ల వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్రగాఢ సానుభూతి వ్య‌క్తం చేశారు. జాతి కోసం కార్తీక్ అత్యున్నత త్యాగానికి వైయ‌స్ జ‌గ‌న్ నివాళుల‌ర్పించారు. ఈ కష్ట సమయంలో అతని కుటుంబ సభ్యులకు దేవుడు బలం అనుగ్రహించాల‌ని ప్రార్థిస్తూ వైయ‌స్ జ‌గ‌న్ త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. 

Back to Top