వైయ‌స్ఆర్‌ఎల్పీ భేటీలో వైయ‌స్‌ జగన్‌ భావోద్వేగం

ప్ర‌తి ఒక్క‌రికి న్యాయం చేస్తా..

క‌లిసి ప్ర‌జా సేవ చేద్దాం

 తాడేపల్లి:  వైయ‌స్ఆర్ ఎల్పీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. తనతో పాటు పార్టీ నేతలు కూడా ఎన్నో కష్టాలు పడ్డారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తనతో పాటు ప్రయాణించారని, ఎవరికీ అన్యాయం చేయనని, ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ఎవరినీ విస్మరించనని, అలాగే ఎవరినీ కూడా వదులుకోనని ఆయన అన్నారు. అందరం కలిసి ప్రజలకు సేవ చేద్దామని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్‌ నేతలు కూడా కన్నీటి పర్యంతమయ్యారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top