తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్లతో వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. జిల్లాల వారీగా వైయస్ జగన్.. ముఖాముఖి నిర్వహిస్తున్నారు. మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులపై వైయస్ఆర్‌సీపీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే నెల్లూరు మేయర్ అభ్యర్థిగా ఆనం విజయ్‌కుమార్ రెడ్డి ఖరారయ్యారు. మిగతా అభ్యర్థులపై వైయస్ జగన్ చర్చిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో అభ్యర్థులంతా ఖరారయ్యే ఛాన్స్ ఉంది. కాగా, తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న (సోమవారం) పార్టీ అనుబంధ విభాగాల రాష్ట్ర అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్లతో సమావేశం నిర్వహించారు. స్థానిక ఎన్నికలే అజెండాగా జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా సజ్జల రామకృష్ణారెడ్డి విచ్చేసి దిశానిర్దేశం చేశారు. పార్టీకి ప్రతి అనుబంధ విభాగం కీలకమన్నారు. అన్ని విభాగాలు సమర్థంగా పనిచేసి లక్ష్యాలను సాధించాలన్నారు.