కడప కార్పొరేషన్ ఎన్నికల్లో బండి దీప్తి రెడ్డి గెలుపునకు కృషి చేయండి

 దాడులు, అడ్డంకులను అధిగమించి పోటీలో నిలిచిన వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులకు వైయ‌స్ జగన్ భరోసా

వైయ‌స్‌ఆర్‌ జిల్లా: కడప కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి కడప కార్పొరేషన్‌ నేతలతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి చేపట్టాల్సిన కార్యాచరణపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. నామినేషన్ల సందర్భంగా జరిగిన దాడులు, ఎదురైన అడ్డంకుల వివరాలను నేతలను అడిగి తెలుసుకున్నారు. ఎన్ని దాడులు, అడ్డంకులు ఎదురైనా పోరాటంతో ఎన్నికల బరిలో నిలిచిన పార్టీ శ్రేణులను వైయ‌స్ జగన్ అభినందించారు. కడప మేయర్‌ అభ్యర్థి బండి దీప్తి రెడ్డి గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సమష్టిగా పనిచేయాలని సూచించారు. ప్రజల్లోకి వెళ్లి పార్టీ విధానాలను వివరించి, ఎన్నికల్లో విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో కడప ఎంపీ వైయ‌స్ అవినాష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా, ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి, రమేష్‌ యాదవ్‌, మేయర్‌ అభ్యర్థి బండి దీప్తి రెడ్డి, మాజీ మేయర్లు సురేష్‌బాబు, పాకా సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Back to Top