తాడేపల్లి: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని దేశాన్ని మరింత ఉజ్వలంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రజాస్వామ్య సూత్రాలే దేశ నిర్మాణానికి మార్గదర్శకం గొప్ప భారతదేశ నిర్మాణానికి మార్గదర్శకంగా నిలిచిన ప్రజాస్వామ్య సూత్రాలను కాపాడుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని వైయస్ జగన్ పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల నుంచి స్ఫూర్తి పొంది ఐక్యత, సమగ్రతతో కూడిన భారతదేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలని కోరారు. మరింత ఉజ్వలమైన, సమగ్రతతో కూడిన, సుసంపన్నమైన భారతదేశాన్ని నిర్మించేందుకు ప్రజలంతా కలిసి ముందుకు సాగాలని వైయస్ జగన్ తన సందేశంలో పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు తన ఎక్స్ ఖాతాలో వైయస్ జగన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ తన సందేశాన్ని ‘జై హింద్’తో ముగించారు.