నానా పటేకర్‌ మృతి పట్ల వైయ‌స్ జగన్‌ దిగ్భ్రాంతి 

తాడేపల్లి: ప్రముఖ సినీ నటుడు నానా పటేకర్ మృతిపై వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారతీయ సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని ప్రశంసలు కురిపించారు. వైయ‌స్ జగన్ తాజాగా ఎక్స్‌ వేదికగా..
‘నానా పటేకర్ మరణవార్త తీవ్రంగా కలచివేసింది. భారతీయ సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. విభిన్న పాత్రల్లో,  విలక్షణ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. నానాపటేకర్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’ అని వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. 

Back to Top