ఢిల్లీకి బ‌య‌లుదేరిన వైయ‌స్ జ‌గ‌న్‌

రేపు ఇండియా టుడే సదస్సులో పాల్గొన‌నున్న ప్ర‌తిప‌క్ష నేత 
 

అమరావతి: వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు,  ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొద్ది సేప‌టి క్రితం హైద‌రాబాద్ నుంచి ఢిల్లీ కి బ‌య‌లుదేరారు. ప్రముఖ మీడియా సంస్థ ‘ఇండియా టుడే’ శ‌నివారం నిర్వహించనున్న సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ‘ఢిల్లీ పీఠంపై ఎవరు కూర్చుంటారో దక్షిణాది ఎలా నిర్ణయిస్తుంది?’ (‘హౌ ది డెక్కన్‌ విల్‌ డిసైడ్‌ హూ సిట్స్‌ ఇన్‌ ఢిల్లీ) అనే అంశంపై ‘ఇండియా టుడే’ శుక్ర, శనివారాల్లో సదస్సు నిర్వహిస్తోంది. ప్రతిపక్ష నేత హోదాలో వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ సదస్సులో ప్రసంగించనున్నారు.  వైయ‌స్ జ‌గ‌న్ వెంట పార్టీ నేత‌లు వైవీ సుబ్బారెడ్డి, బాల‌శౌరీ,మిథున్‌రెడ్డి, ఇత‌ర మాజీ ఎంపీలు ఉన్నారు.
 

Back to Top