కేర‌ళ మాజీ సీఎం అచ్యుతానందన్‌ మృతికి వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం

తాడేప‌ల్లి:  ప్రముఖ కమ్యూనిస్టు నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి వెలిక్కకట్టు శంకరన్ అచ్యుతానందన్‌  మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు  వైయస్‌ జగన్‌ సంతాపం వ్యక్తం చేశారు. అచ్యుతానందన్ మరణంతో కేరళ రాజకీయ రంగం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది. ఆయన ధైర్యం, నిబద్ధత, ప్రజల పట్ల ప్రేమ ప్రజల మనసుల్లో చిర స్థాయిగా నిలిచిపోతాయని వైయస్‌ జగన్‌ అన్నారు. అచ్యుతానందన్‌ కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Back to Top