నంద్యాల: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ నంద్యాల జిల్లా డోన్‌లో పర్యటించారు. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరయ్యారు. డోన్ దత్తాత్రేయ స్వామి గుడి దగ్గర జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్‌లో నూతన వధూవరులు అనన్య రెడ్డి, బుగ్గన అర్జున్ అమర్నాథ్‌లకు వైయస్ జగన్ వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. డోన్‌కు వచ్చిన వైయస్ జగన్‌కు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎమ్మెల్యే విరూపాక్షి, పార్టీ నేతలు ఎస్వీ మోహన్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, నాగిరెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. వైయస్ జగన్‌తో కరచాలనం చేసేందుకు పార్టీ శ్రేణులు, అభిమానులు, స్థానికులు పోటీపడ్డారు. అందరికీ వైయస్ జగన్ అభివాదం చేస్తూ ముందుకు సాగారు.