కేజీహెచ్ లో వైద్య పరికరాల కొరత

వెంటనే నూతన మెషీన్లు ఏర్పాటు చేయాలి

సీఎంకు లేఖ రాసిన బొత్స సత్యనారాయణ

విశాఖపట్నం: ఏడాదిగా కూటమి పాల నలో పేదలకు తగిన వైద్యం అందడం లేదని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్య నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కింగ్ జార్జ్ ఆస్పత్రి(కేజీహెచ్) దయనీయ పరిస్థితు లపై సీఎం చంద్రబాబుకు ఆయన మంగళ వారం లేఖ రాశారు. 'కేజీహెచ్కు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా, ఛత్తీస్ గడ్ నుంచి రోగులు వైద్య సేవల కోసం వస్తున్నారు. ఉచిత సేవలు అందించే కేజీహెచ్ కార్డి యాలజీ విభాగంలో గుండె శస్త్ర చికిత్సలకు వైద్య పరికరాలు లేకపోవడంతో గత ఏడా దిగా ఓపెన్ హార్ట్ సర్జరీలకు తీవ్ర అంత రాయం కలుగుతోంది. నెలకు 40 వరకూ గుండె శస్త్రచికిత్సలు జరిగే ఆస్పత్రిలో అవసర మైన వైద్య పరికరాలు అందుబాటులో లేవు. దీంతో పేద రోగులు అప్పులు చేసి ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆర్థిక స్తోమత లేని రోగులు మృత్యువాత పడుతు న్నారు. తక్షణమే కేజీహెచ్ లో అవసరమైన వైద్య పరికరాలు ఏర్పాటు చేయాలి' అని ఆ లేఖలో డిమాండ్ చేశారు. 

Back to Top