డెక్కన్‌ క్రానికల్‌ కార్యాలయంపై దాడి పిరికిపంద చర్య.. 

చంద్రబాబు బాధ్యత వహించాలి: వైయ‌స్‌ జగన్‌
 

తాడేపల్లి: విశాఖలో డెక్కన్‌ క్రానికల్‌ కార్యాలయంపై టీడీపీ జరిపిన దాడిని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఖండించారు. ఈ దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించిన ఆయన.. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబే ఘటనకు బాధ్యత వహించాలన్నారు. 
  డెక్కన్‌ క్రానికల్‌ ఆఫీసుపై టీడీపీ నేతలు జరిపిన దాడి పిరికిపంద చర్య. ఇది మీడియాను అణచివేసే కుట్రలో భాగమే. నిష్పక్షపాత వార్తలను టీడీపీ జీర్ణించుకోలేకపోతుంది. ఏపీలో కూటమి పాలనలో ప్రజస్వామ్యం ఖూనీ అవుతోంది. దీనికి ఏపీ సీఎం చంద్రబాబు పూర్తి బాధ్యత వహించాలి అని తన ఎక్స్‌ ఖాతాలో వైయ‌స్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

 

Back to Top