అప్రజాస్వామికంగా సాగునీటి సంఘాల ఎన్నికలు

ఇది చేతకాని దద్దమ్మ ప్రభుత్వం

కడప ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి ధ్వజం

కడపలో వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి ప్రెస్‌మీట్‌.

ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా సాగునీటి సంఘాల ఎన్నికలు

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ప్రభుత్వ వ్యవహారం

ఎన్నికల్లో పాల్గొనకుండా కూటమి ప్రభుత్వం కుట్రలు

వైయస్సార్‌సీపీ సానుభూతిపరులను పూర్తిగా అడ్డుకున్నారు

పోటీకి సిద్ధమైన రైతులకు వీఆర్‌ఓలు ఎన్‌ఓసీ ఇవ్వలేదు

ఎంపీ అవినాష్‌రెడ్డి వెల్లడి

నో డ్యూస్‌ ఇవ్వకుండా ప్రభుత్వం దారుణ కుతంత్రం

వీఆర్‌ఓలు అందరినీ మండల ఆఫీస్‌కు తరలించారు

రెండు రోజుల పాటు, వారిని ఖైదీల మాదిరిగా ఉంచారు

బయట పోలీసులను కాపలాగా పెట్టారు. ఎవరినీ వదల్లేదు

అలా వీఆర్‌ఓలు ఎన్‌ఓసీలు ఇవ్వకుండా కుట్ర చేశారు

కానీ ఎన్‌ఓసీల కోసం రైతులు రాలేదని చెబుతున్నారు

దిక్కుమాలిన రాజకీయాలతో గెలుపు ఒక గెలుపేనా?

ఇంత కంటే సిగ్గుచేటు మరొకటి ఉంటుందా?

ప్రెస్‌మీట్‌లో వైయస్‌ అవినాష్‌రెడ్డి ఆక్షేపణ

కడప: సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికల్లో గెలుపుపై ఏ మాత్రం నమ్మకం లేకపోవడం వల్లనే కూటమి ప్రభుత్వం కుట్రలు, కుతంత్రాలు చేసిందని కడప ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరించడంతో, తాము ఎన్నికలను బహిష్కరించామని ఆయన వెల్లడించారు. అలా ఈ ఎన్నికల్లో గెల్చి, అదేదో తమ గొప్ప విజయం అన్నట్లుగా పులివెందుల మాజీ ఎమ్మెల్సీ చెప్పుకుంటున్నారని ఆక్షేపించారు.

 అప్రజాస్వామిక ఎన్నికలు:

– జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికల సినిమాకు స్క్రీన్‌ప్లే, ప్రొడ్యూసర్, డైరెక్టర్‌.. చివరకు ప్రేక్షకుడు, ఆ సినిమాపై రివ్యూ కూడా ఇచ్చేది మాజీ ఎమ్మెల్సీ బిటెక్‌ రవి.
– సాగునీటి సంఘాల ఎన్నికలు ఎంత ప్రజాస్వామ్య విరుద్ధంగా జరిగాయన్నది.. గడచిన రెండు, మూడు రోజులుగా ఈ ఎన్నికల ప్రహసనం ఎలా కొనసాగిందో మీరంతా చూశారు.
– నీటిపారుదల శాఖ ఈ సంఘాల ఎన్నికలు నిర్వహిస్తుంది. ఎవరైనా రైతులు ఈ ఎన్నికల్లో టీసీ (ప్రాదేశిక నియోజకవర్గం) సభ్యుడిగా పోటీ చేయాలనుకుంటే, నీటి బకాయిలు పూర్తిగా చెల్లించి ఉండాలి. ఆ మేరకు వీఆర్‌ఓ నుంచి నో డ్యూస్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌ఓసీ) తీసుకోవాలి. ఇది తప్పనిసరి. 
– అది ఉంటేనే నామినేషన్‌ అనుమతిస్తారు. లేకపోతే రిజెక్ట్‌ చేస్తారు. అది టీడీపీ ప్రభుత్వం పెట్టిన నిబంధన.

ఎన్‌ఓసీలు ఇవ్వకుండా కుట్ర:
– ఈ ఎన్నికలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, వీఆర్‌ఓలు అంతా గ్రామ సచివాలయాల్లో ఉండాలి. కానీ చాలా మంది వీఆర్‌ఓలు ఫోన్లు స్విచాఫ్‌ చేసి కూర్చున్నారు.
– ఇంకా అందరు వీఆర్‌ఓలను మండల ఆఫీస్‌కు తీసుకుపోయి, నిర్భంధం చేశారు. బయట పోలీసులను కాపలగా పెట్టారు.
– వారిని రెండు రోజుల పాటు మండల ఆఫీస్‌లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది? వారిని అక్కడ జైల్లో ఖైదీలుగా ఉంచినట్లు ఉంచారు.
– ఏ రైతు కూడా తమ వీఆర్‌ఓను కలిసే వీలు లేకుండా చేశారు. అలా వీఆర్‌ఓలు ఆ సర్టిఫికెట్లు ఇవ్వకుండా కుట్ర చేశారు.

చేతకాని దద్దమ్మ ప్రభుత్వం:
– ఇది చేతకాని దద్దమ్మ ప్రభుత్వం. పోలీసులను అడ్డు పెట్టుకుని ఎన్నికలు చేయడం చేతకానితనం.
– ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగి ఉంటే, రైతులు ఓటు వేసి ఉంటే, టీడీపీ పులివెందుల ఇన్‌ఛార్జ్‌ను చొక్కా విప్పి కూర్చోబెట్టి ఉండేవారు.
మా పార్టీ సానుభూతిపరులు పోటీ చేస్తే, ఓడిపోతామని చెప్పి, రైతులకు నోడ్యూస్‌ సర్టిఫికెట్స్‌ ఇవ్వలేదు.
– దీన్ని ఎన్నికల నిర్వహణ అంటారా? మీరు చేసిన  ఈ తతంగం ప్రజాస్వామబద్ధమా?
– వీఆర్‌ఓలు గ్రామ సచివాలయాల్లో ఉండకుండా, వారిని ఎందుకు మండల ఆఫీస్‌ల్లో బంధించి ఉంచారు. చివరకు కవరేజ్‌కు వచ్చిన మీడియాపైనా దాడి చేశారు. 
– ఇన్ని పనులు చేసి, నో డ్యూస్‌ సర్టిఫికెట్‌ కోసం ఎవరూ రాలేదని పచ్చి అబద్ధాలు చెప్పారు.

నిజంగా మీకా ధైర్యం ఉంటే..:
– మీ ఆఫీస్‌లో కూర్చుని మాట్లాడడం కాదు. మీకు నిజంగా ధైర్యం ఉండి ఉంటే, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించి ఉండాల్సింది. కానీ, ఆ పని చేయకుండా, మా పార్టీ సానుభూతిపరులు పోటీ చేయకుండా, వారికి ఎన్‌ఓసీలు ఇవ్వకుండా కుట్ర చేశారు.
– అసలు మీరు ఏ పని చేశారని రైతులు మీకు ఓటేస్తారు? 
– మీ ప్రభుత్వం వచ్చి 6 నెలలైంది. పెట్టుబడి సాయంగా రూ.20 వేలు ఇస్తామని చెప్పి, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. రైతులకు ఉచిత పంటల బీమా లేదు. పంటలు, ధాన్యం సేకరణ లేదు. కనీస మద్దతు ధర లేదు. మీ ప్రభుత్వం వస్తే ఈ–క్రాప్‌ విధానం తీసేస్తామన్నారు. ఈరోజు అదే విధానాన్ని అమలు చేస్తున్నారు.
– మీ ప్రభుత్వం అని విధాలుగా ఫెయిల్‌. అందుకే ఓటమి భయంతో రైతుల పోటీ చేయకుండా అడ్డుకున్నారు.

ఎందుకా సిగ్గులేని మాటలు?:
– 1978 నుంచి ఉన్న రాజకీయాలను కూకటివేళ్లతో పెకిలించావా? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. నీ ముఖం ఒకసారి అద్దంలో చూసుకో.
– ఈ ఎన్నికలు ఎలా చేశారనేది ఇక్కడ ప్రతి ఒక్కరూ గమనించారు.
ఒక్క పులివెందులలోనే కాదు, జమ్మలమడుగులో కూడా అదే పని చేశారు. వీఆర్‌ఓలు అందరినీ తీసుకెళ్లి, దేవగుడిలో బంధించారు. ఇది వాస్తవం కాదా?
– కేవలం ఓడిపోతామనే భయంతోనే కదా అవన్నీ చేసింది. నో డ్యూస్‌ సర్టిఫికెట్లు ఇవ్వకుండా, రైతులు పోటీ చేయకుండా చేయడం సిగ్గు చేటు కాదా? రెవెన్యూ, పోలీసు అధికారులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం కాదు. 
– అందుకే ఇకనైనా ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయాలు  చేయడం నేర్చుకోవాలని ఎంపీ అవినాష్‌రెడ్డి హితవు చెప్పారు.

Back to Top