కడప: కడప పార్లమెంటు సభ్యులు వైయస్ అవినాష్ రెడ్డి జన్మదిన వేడుకలను కడప నగరంలో వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ బాషా క్యాంప్ కార్యాలయంలో పెద్దరెడ్డి రామ్‌మోహన్ రెడ్డి, పెద్దరెడ్డి రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి అవినాష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ బాషా, మాజీ టీటీడీ బోర్డు సభ్యులు మాసిం బాబు, మహిళా జిల్లా అధ్యక్షురాలు తెలుగుపులి వెంకటసుబ్బమ్మ, కడప నగర మాజీ మేయర్ పాకా సురేష్, మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పులి సునీల్ కుమార్, కడప మాజీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ తెలుగుపులి దుర్గాప్రసాద్, కడప జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు వెంకటేశ్వరులు, కడప నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు బాబు తదితరులు పాల్గొన్నారు. వైయస్ అవినాష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నాయకులు, నాయకురాళ్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. పులివెందులలో.. పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయపేటలో కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు భారీ కేక్ కట్ చేసి ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో మండల కన్వీనర్ బెల్లం ప్రవీణ్ కుమార్ రెడ్డి, జడ్పీటీసీ శివప్రసాద్ రెడ్డి, ఎంపీపీ మాధవి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వైయస్ అవినాష్ రెడ్డి ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.