టీడీపీ  దౌర్జ‌న్యాల‌ను స‌హించం

ఎమ్మెల్యే కోటంరెడ్డిపై అక్ర‌మ కేసులు దారుణం

టీడీపీ ఎన్ని కుట్ర‌లు చేసినా భ‌య‌ప‌డం..

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి

నెల్లూరు: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్ట‌డం దారుణ‌మ‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మేల్యే కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి అన్నారు.ఓట‌మి భ‌యంతోనే చంద్ర‌బాబు కుట్ర‌లు ప‌న్ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యేల‌పై త‌ప్పుడు కేసులు పెట్టిస్తున్నార‌ని ఆరోపించారు.ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న‌వారి ప‌ట్ల పోలీసుల దారుణంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌న్నారు.చంద్ర‌బాబు చేస్తున్న పాపాలు భ‌విష్య‌త్‌లో శాపాలుగా వెంటాడ‌తాయ‌న్నారు. అధికారం చేతుల్లో ఉంది కాదా అని ఇష్ట‌రాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తే చూస్తూ ఉరుకోమ‌ని హెచ్చ‌రించారు.అక్ర‌మ పెట్టి వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు,కార్య‌క‌ర్త‌ల‌ను,వారి కుటుంబ స‌భ్యును భ‌య‌బ్రాంతుల‌ను చేయాల‌ని ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తుంద‌న్నారు.టీడీపీ ఎన్ని కుట్ర‌లు చేసినా భ‌య‌ప‌డేది లేద‌న్నారు. తెలుగుదేశం పార్టీ అరాచ‌కాల‌పై  వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు,కార్య‌క‌ర్త‌లు ఐక్యంగా ఉద్య‌మిస్తామ‌ని తెలిపారు.ఎన్నిక‌ల స‌మీపంలో టీడీపీ చేస్తున్న దౌర్జ‌న్యాలు శాంతి భ‌ద్ర‌త‌లకు విఘాతం క‌లిగిస్తున్నాయ‌న్నారు.అరాచ‌క చ‌ర్య‌ల‌కు పాల్ప‌డితే స‌హించేది లేద‌ని టీడీపీ నేత‌ల‌ను హెచ్చ‌రించారు. 

Back to Top