సామాన్య ప్రజలపై ఆర్థిక భారం వేయ్యం

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ 
 

 విజయవాడ :  సామాన్య ప్రజలపై ఆర్థిక భారం వేసే పనిని తమ ప్రభుత్వం చెయ్యదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. టీడీపీ నేతలు కరోనా వైరస్‌ను కూడా రాజకీయంగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. ద్వారావతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వలస కూలీలకు నిత్యావసర సరుకులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సీఎం వైయస్‌ జగన్ మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో పరిపాలిస్తున్నారని తెలిపారు. దేశంలోనే అత్యధిక కరోనా టెస్టులు చేసిన రాష్ట్రంగా ఏపీ నిలిచిందన్నారు. తెలుగుదేశం పార్టీ ఇప్పటికైనా నీచ రాజకీయాలు మానుకోవాలని సూచించారు.

Back to Top