సీఎం వైయస్ జగన్ ఫ్యామిలీపై షర్మిల విషం కక్కుతున్నారు

 వైయ‌స్ఆర్‌సీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ  

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఫ్యామిలీపై ష‌ర్మిల విషం క‌క్కుతున్నార‌ని  వైయ‌స్ఆర్‌సీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ  పేర్కొన్నారు. వైయ‌స్‌ జగన్ వ్యక్తిత్వం, స్వభావం మీకు తెలియదా...వైయ‌స్ జగన్ గారు ఎవరిచేతిలోనో రిమోట్ కంట్రోల్ గా వ్యవహరిస్తారా...అని ప్ర‌శ్నించారు. బుధ‌వారం వాసిరెడ్డి ప‌ద్మ మీడియాతో మాట్లాడారు.

మాట్లాడితే భారతిగారి పేరు తీసుకువస్తున్నారు. సందర్భం లేకుండా ఆమె పేరు తీసుకురావడం అభ్యంతరకరమ‌న్నారు.  భారతి వేకువజామునే ఫోన్ చేశారని మీకు ఎవరు చెప్పారో సునీత సమాధానం చెప్పాలని నిల‌దీశారు. కట్టుకధలు అల్లుకుంటూ మాట్లాడుతున్నారు. భారతిపై దుమ్మెత్తిపోయడం దారుణమ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  షర్మిల తెలంగాణాలో పార్టీ పెట్టి ఎంతోమందిని సర్వనాశనం చేసి చాప చుట్టేశారు.కారణం లేకుండా పార్టీని క్లోజ్ చేసుకువచ్చారు.

 చంద్రబాబుచేతిలో ష‌ర్మిల కీలుబొమ్మ  అని విమ‌ర్శించారు. ఆయన జేబు బొమ్మలులాగా షర్మిల, సునీతలు మాట్లాడుతున్నార‌ని మండిప‌డ్డారు.  వ్యక్తిగతమైన ఎజెండాతో షర్మిల మాట్లాడుతున్నారు. అసలు మీ అజెండా ఏంటో చెప్పండి అని ప్ర‌శ్నించారు.

కడప ఎంపీగా అవినాష్ రెడ్డికి సీటు ఇస్తే ఇంతగా  విషం చిమ్ముతారా ,అవినాష్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నందుకు వైయ‌స్‌ జగన్ గారిపై పగ. ద్వేషమ‌న్నారు.  ఎవరి వ్యక్తిగత ఎజెండా కోసమో కాంగ్రెస్ పార్టీ ఉపయోగపడే దయనీయస్దితిలో కాంగ్రెస్ ఉంద‌న్నారు.

 నిన్ననే  ష‌ర్మిల‌ ఆడియో బయటకు వచ్చింది. వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ సీట్లు ఇవ్వని నాయకులను చేర్చుకుంటున్నారు. పాడేరులో వైయ‌స్ఆర్‌సీపీ నేతను తీసుకువచ్చి సీటు ఇస్తానని చెప్పి ఆ తర్వాత ఏ కారణం చేతనో సీటు ఇవ్వలేదు. వేరే అతనికి సీటు ఇస్తున్నందుకు ఇతనితో ఫోన్ లో మాట్లాడుతూ వైయ‌స్ఆర్‌సీపీ ఓటు బ్యాంక్ వస్తుందనుకున్నాం మీరు రెబల్ గా పోటీ చేస్తే ఊరుకునేది లేదంటూ వార్నింగ్ లు ఇస్తున్నారు.  అంటే వైయ‌స్ఆర్‌సీపీ ఓటు బ్యాంకును చీల్చడమే షర్మిల ఎజెండాగా కనిపిస్తోందని ధ్వ‌జ‌మెత్తారు. 

వైయ‌స్ఆర్‌సీపీ ఓటు చీల్చటమే పనిగా షర్మిల పెట్టుకున్నారు. నిజానికి బిజేపి, జనసేనలను కలుపుకున్న చంద్రబాబు షర్మిలను కూడా దువ్వుతున్నారు. ఆ టార్గెట్ వెనుక చంద్రబాబు ఉన్నారు.  చంద్రబాబు చేతిలో ష‌ర్మిల రిమోట్ కంట్రోల్‌గా మారార‌ని వాసిరెడ్డి ప‌ద్మ‌ విమ‌ర్శించారు.

 తెలంగాణా లో షర్మిలను కాంగ్రెస్ లో అడుగుపెట్టనీయకుండా చేసిన రేవంత్ రెడ్డి ఈరోజు మీకు సహాయసహకారాలు అందిస్తున్నారు. ఎవరిచేతిలో కీలుబొమ్మగా ఉన్నారో తెలియదనుకుంటున్నారా.?  రాష్ట్రంలో కోట్లాదిమంది ప్రజల గుండెల్లో వైయస్ జగన్ ఉన్నారు.ప్రజలు ఆరాధ్యంగా చూసుకునే వైయ‌స్ జగన్ గారిపై ఇష్టారాజ్యంగా మాట్లాడే హక్కు ఎవరిచ్చార‌ని ఆమె ప్ర‌శ్నించారు.

వైయస్ జగన్ కి చెల్లెళ్లు అనే హోదా తప్ప షర్మిల, సునీతలకు ఈ రాష్ట్రంలో ఏముంద‌ని నిల‌దీశారు.  చంద్రబాబును గెలిపించాలనే ధ్యేయంతో షర్మిల, సునీతలు మాట్లాడేవన్నీ పచ్చమీడియా హైలెట్ చేస్తోంది. ఎన్నికల ప్రచారం ముగిసిన  తర్వాత పచ్చమీడియా మీ ముఖాలను టీవీలో చూపించదు. - షర్మిల,సునీతలూ ఆ సంగతి గుర్తు పెట్టుకోండి.మీ గతి ఏమవుతుందో చూడండి.  చంద్రబాబు వీరిద్దరితో పిచ్చెక్కినట్లు మాట్లాడించేలా ఆడిస్తున్నారు.చంద్రబాబు మేలు చేయడానికి ఎంతగా తపన పడుతున్నారో అర్దమవుతుంది.  చంద్రబాబు మనుషులమే అని ముద్ర వేయించుకుంటున్నారు. - ఎన్నికల తర్వాత చంద్రబాబు, ఎల్లోమీడియా అసలు పట్టించుకోదు. షర్మిల, సునీత చూపుతున్న ఉన్మాదం వలన వారికే నష్టం జరుగుతుంది.

 వైయ‌స్ఆర్ కుటుంబం ఎటుపోయినా పర్లేదు అన్నట్టుగా వారు వ్యవహరిస్తున్నార‌ని వాసిరెడ్డి ప‌ద్మ త‌ప్పుప‌ట్టారు.  వివేకానందరెడ్డి పరువు షర్మిల, సునీతలు నడిరోడ్డు మీద పెట్టారు. ఆయన వ్యక్తిత్వం కాపాడుకోవాలని వైయ‌స్ జగన్ భావిస్తుంటే రెండో వివాహం గురించి కూడా మీరే బయటమాట్లాడేలా చేస్తున్నారు.  షర్మిలకు మెదడు పని చేస్తుందా.   కాంగ్రెస్ పార్టీ తప్పు లేదని ఇప్పుడు షర్మిల అనటం వెనుక కారణం ఏంటి. వైయ‌స్ఆర్‌ పేరును ఎఫ్.ఐ.ఆర్.లో చేర్చారనే బాధతో లాయర్ సుధాకర్ రెడ్డి కేసు వేశారు . మీరు చెప్పినట్టు వైయ‌స్ జగన్ వినలేదని చంద్రబాబు జేబులో బొమ్మలుగా మారుతారా అని ప్ర‌శ్నించారు.

వైయ‌స్  జగన్ చెల్లెల్లు కాకపోతే అసలు షర్మిళ, సునీతలను ఎవరు పట్టించుకుంటారు.  అసలు ఏం జరిగిందీ అనేది కడప ప్రజలకు తెలుసు అన్నారు.  షర్మిల,సునీతల వల్ల మాకు జరిగే నష్టం ఏమీ లేదు.మీరే చులకన అవుతున్నారు. మే 13 తర్వాత మీ దుస్దితి ఏంటో ఆలోచించండి.విజ్ఞతతో ఆలోచించండి.  నాటకాలు కట్టిపెట్టి షర్మిల,సునీతలు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలి.  మీ వైఖరి వల్ల వైయ‌స్ జగన్ గారిపై అపార సానుభూతి కలుగుతుంది తప్పితే మరేమి కాద‌ని వాసిరెడ్డి ప‌ద్మ వ్యాఖ్యానించారు. 

Back to Top