అగ్నిప్రమాద బాధితులకు అండగా వైయ‌స్ఆర్‌సీపీ..

దగ్ధమైన దుకాణాలను పరిశీలించిన పిల్లి సుభాష్ చంద్రబోస్, పిల్లి సూర్యప్రకాశ్

రామచంద్రపురం: రామచంద్రపురం కూరగాయల మార్కెట్లో శుక్రవారం తెల్ల‌వారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో దగ్ధమైన దుకాణాలను మాజీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, వైయ‌స్ఆర్‌సీపీ రామచంద్రపురం నియోజకవర్గ సమన్వయకర్త పిల్లి సూర్యప్రకాశ్ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. రాత్రి సుమారు 12 గంటల సమయంలో చోటుచేసుకున్న ఈ అగ్నిప్రమాదంలో పలువురు వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. ఘటన స్థలానికి చేరుకున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, పిల్లి సూర్యప్రకాశ్ బాధిత వ్యాపారులతో మాట్లాడి జరిగిన నష్టంపై వివరాలు తెలుసుకున్నారు. అగ్నిప్రమాదం కారణంగా జీవనోపాధి కోల్పోయిన వ్యాపారులకు ధైర్యం చెబుతూ వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బాధితులకు ప్రభుత్వం తక్షణ సాయం అందించాలని, నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారం ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. చిన్న వ్యాపారుల జీవనాధారమైన దుకాణాలు అగ్నికి ఆహుతి కావడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ, కష్టకాలంలో ప్రజల పక్షాన నిలబడటం వైయ‌స్ఆర్‌సీపీ విధానమని, బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
 

Back to Top