స‌మ‌గ్ర అవ‌గాహ‌న క‌ల్పించేందుకే రెవెన్యూ శాఖ ప్రాంతీయ సదస్సు

రెవెన్యూ శాఖ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు

విశాఖపట్నం: రెవెన్యూ వ్యవహారాలకు సంబంధించిన అంశాలపై సమగ్ర అవగాహన కల్పించేందుకు ఉత్త‌రాంధ్ర రీజ‌న‌ల్ రెవెన్యూ ఆఫీస‌ర్స్ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హిస్తున్నామ‌ని రెవెన్యూ శాఖ‌ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు తెలిపారు. రుషికొండలోని రాడిసన్‌ బ్లూ హోటల్‌లో ఉత్తరాంధ్ర రీజనల్ రెవెన్యూ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్‌ను మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. ఈ సదస్సుకు ఉత్తరాంధ్ర పరిధిలోని జిల్లాల కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, జిల్లా రెవెన్యూ అధికారులు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, సీసీఎల్‌ఏ, రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి, సర్వే అండ్‌ సెటిల్‌మెంట్‌ డైరెక్టర్లు సైతం ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి ధర్మాన ప్ర‌సాద‌రావు మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖలో సంస్కరణ అమలుపై సదస్సు నిర్వహించామ‌ని చెప్పారు. వందేళ్ల తర్వాత రాష్ట్రంలో ఆధునిక సాంకేతికతతో సర్వే చేస్తున్నామ‌ని వివ‌రించారు. అసైన్డ్‌ భూములు వ్యవసాయేతర పనులకు వినియోగంపై కమిటీ ఏర్పాటు చేస్తున్నామ‌ని చెప్పారు. భూములను వినియోగంలోకి తేవడం ద్వారా జీడీపీ పెరుగుతుందని మంత్రి ధ‌ర్మాన వివ‌రించారు. 

Back to Top