శ్రీ సత్యసాయి జిల్లా: కష్టాల్లో ఉన్న రైతులకు వైయస్ఆర్‌సీపీ అండగా ఉంటుందని వైయస్ఆర్‌సీపీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో రైతులకు ఎరువుల (యూరియా,డిఎపి)కొరత ఉన్న నేపథ్యంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం వైయస్ఆర్‌సీపీ నేతలతో కలిసి ఆమె జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ ఆదేశాలు మేరకు, ఎరువుల కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు తీవ్రంగా కష్టాలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తున్నాం. వ్యవసాయాన్ని సంక్షోభంలో కూరుకు పోయేలా చేస్తున్న చంద్రబాబు అన్నదాతల ఉసురు తీస్తున్నారు, మా ప్రభుత్వం ఐదేళ్లు వైయస్సార్ రైతు భరోసా ఏటా 13500 అందించి అన్నదాతలకు తోడుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలిచిందన్నారు. పరిస్థితులు ఇప్పుడు లేవు, లక్షణంగా కొనసాగుతున్న రైతు భరోసా పథకాన్ని ఆపిన దుర్మార్గుడు చంద్రబాబు. రెండో ఏడాది ఖరీఫ్ ప్రారంభమై రెండు నెలలు దాటిపోయింది, ఇప్పుడు రెండేళ్లకు 40000 గాను ఐదు వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు, అది కూడా ఏడు లక్షల మంది అన్నదాతలకు అన్నదాత సుఖీభవ వర్తింపజేయకుండా ఎగ్గొట్టిన పాపాత్ముడు చంద్రబాబు అన్నారు.. సబ్సిడీ ఎరువులు అందించాల్సింది పోయి, ప్రవేట్ లో కొనుకొనేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని రైతులు మండిపడుతున్నారు, ఒక పక్క ప్రభుత్వం ఇవ్వకుండా మరోవైపు కాంప్లెక్స్ ఎరువుల ధరను సైతం పెంచేస్తున్నారు, ఎరువుల కంపెనీలు 100 నుంచి 255 వరకు కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచిన ప్రభుత్వం కిమ్మిన కూడా ఉంది, టిడిపి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతులకు అనే హామీ ఇచ్చింది, సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ రూపంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోగా రైతులను మరిన్ని కష్టాలు గురిచేస్తోందన్నారు, వీటితోపాటు ఏ రైతు గిట్టుబాటు ధర దొరకడం లేదు, రైతు తాను పండించిన పట్టిన రోడ్డు మీద వేయాల్సిన పరిస్థితి, మా ప్రభుత్వంలో రైతుల్ని ఆదుకున్న ధరల స్థిరీకరణ నిధిని ఎత్తివేసి రైతులు కష్టాలు పాలు చేశారన్నారు, ఉచిత పంట బీమాను రద్దు చేశారు, గత ఏడాది ఇన్సూరెన్స్ ను చెల్లించకపోవడంతో రైతులు బీమా డబ్బులు రాని పరిస్థితి ఏర్పడింది, అంతేకాదు రైతులకు సున్నా వడ్డీ పథకాలు కూడా ఎత్తివేశారు, రైతులకు విత్తనం నుంచి పంట అమ్మడం వరకు అండగా ఉన్న ఆర్బికేల వ్యవస్థను పూర్తిగా నీరు గార్చేశారు, గ్రామస్థాయిలో రైతులకు చేదోడుగా ఉన్న వ్యవస్థలను ధ్వంసం చేశారన్నారు, ఎరువులు కోసం మళ్లీ రైతులు క్యూ లైన్ లో నిడబాల్సిన పరిస్థితి నెలకొన్నాయి, రైతులకు అందుబాటులో ఎరువులు ముఖ్యంగా యూరియా దొరకపోవడంతో ఎక్కడకు వెళ్లారు రైతులు అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు, యూరియా కేటాయింపులకు సరఫరాకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. పొటాష్ కలిసిన కాంప్లెక్స్ సర్వ ధరలు అమాంతం పెరిగిపోయాయి, బఫర్ స్టాక్ నిర్వహణ లోపం కారణంగా యూరియా ధరలను సైతం వ్యాపారస్తులు పెంచేస్తున్నారు, యూరియా బస్తాలపై బ్లాక్ మార్కెట్లో 60 రూపాయల నుంచి 100 రూపాయలు వరకు అదనంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొన్న అన్నారు, కళ్ళ ముందు కనిపిస్తున్న రైతుల సమస్యలను పరిష్కరించకుండా కక్ష సాధింపు రాజకీయాలు డైవర్షన్ రాజకీయాలే ప్రాధాన్యత ఇస్తున్నారు, రైతులు ఓవైపు కష్టాలు పడుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కనీసం సమీక్షలు చేసే పరిస్థితి కూడా కనిపించలేదు, ఈ విషయాన్ని ప్రభుత్వం తీసుకున్నట్లు ఎక్కడ కనిపించట్లేదు రైతులు సమస్య పట్ల ప్రభుత్వం చాలా ఉదాసీనతతో వ్యవహరిస్తోందని కూటమి ప్రభుత్వము పై తీవ్రంగా మండిపడ్డారు.. ఈ కార్యక్రమంలో పెనుకొండ నియోజకవర్గ పలు మండలాల ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ నాయకులు, మహిళా నాయకులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..