16న వైయ‌స్‌ జగన్‌ నేతృత్వంలో గవర్నర్‌కు కోటి సంతకాలు అందజేత 

మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణపై కోటి సంతకాల ప్రజా ఉద్యమానికి అనూహ్య స్పందన

వైయ‌స్ఆర్‌సీపీ స్టేట్‌ కో–ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేప‌ల్లి: ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయ‌స్ఆర్‌సీపీ చేపట్టి­న కోటి సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమానికి అన్నివర్గాల ప్రజల నుంచి అనూహ్యమైన స్పంద­న వచ్చిందని వైయ‌స్ఆర్‌సీపీ స్టేట్‌ కో–ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. వైయ‌స్ఆర్‌సీపీ జి­ల్లా పార్టీల అధ్యక్షులు, పార్లమెంటరీ పరిశీల­కులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు (కో–ఆర్డినే­షన్, అను­బంధ విభాగాలు), రాష్ట్ర కార్యదర్శులు (కో–ఆర్డి­నే­షన్‌), ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమ­న్వయక­ర్తలు, రాష్ట్ర కార్యదర్శులు (పార్లమెంట్‌)­తో బు­ధ­వారం రామకృష్ణారెడ్డి టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 
ఈ సందర్భంగా ఆయన మాట్లా­డుతూ.. కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంలా సా­గిందన్నారు. సంతకాలు కోటి అనుకుంటే అంత­కుమించి వస్తున్నాయని చెప్పారు. ఇప్పటి­వరకు నియోజకవర్గ స్థాయిలో సేకరించిన సంత­కాలను ఈ నెల 10న జిల్లా పార్టీ కా­ర్యాలయాలకు పంపాలని సూచించారు. 13న జిల్లా కార్యాలయాల నుంచి కేంద్ర కార్యాలయం తాడే­పల్లికి పంపాలని కోరారు. ఈ నెల 16న పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నేతృత్వంలో గవర్నర్‌కు  కోటి సంతకాలు అంద­జేయనున్నట్టు చెప్పారు.

సేకరించిన సంతకాలన్నీ నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజల ముందు, మీడి­యా ముందు ప్రదర్శించి వారి సమక్షంలోనే బా­క్సుల్లో సర్ది వాహనాల్లో పెట్టి నాయకులు జెండా ఊపి జిల్లా పార్టీ కార్యాలయానికి పంపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమైన నా­యకులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. 13న జిల్లా కేంద్రంలో కూడా అదే స్థాయిలో కార్యక్ర­మం నిర్వహించి అక్కడి నుంచి రాష్ట్ర కార్యాల­యానికి పంపాలని చెప్పారు. 

ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని అధినేత వైఎస్‌ జగన్‌ ప్రత్యేకంగా చెప్పారని వెల్లడించారు. జిల్లా కేంద్రం నుంచి వేలాది మందితో ర్యాలీలు చేపట్టి రాష్ట్ర కార్యాలయానికి పంపాలన్నారు. పార్టీ అనుబంధ విభాగాలు కూడా ఇందులో కీలకపాత్ర పోషించాలని సూచించారు.

Back to Top