ఏలూరులో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ సమావేశం.. 

కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ 

 ఏలూరు : వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు “వెన్నుపోటుకు రెండేళ్లు” నిరసన కార్యక్రమంలో భాగంగా ఏలూరు నియోజకవర్గంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఏలూరు నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌ఛార్జ్ మామిళ్లపల్లి జయప్రకాష్ (జేపీ) ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, సంక్షేమ పథకాల పరిస్థితి, వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై నాయకులు చర్చించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని నాయకులు విమర్శించారు. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై మరింతగా పోరాడాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు.
 

Back to Top