ఏపీ వైద్యశాఖకు జాతీయ స్థాయి అవార్డులు 

అవార్డుల‌ను స్వీక‌రించ‌నున్న మంత్రి ర‌జిని, అధికారులు

తాడేప‌ల్లి: ప్రజల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్న వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి జాతీయ స్థాయిలో మరోసారి ప్రత్యేక గుర్తింపు లభించింది. రాష్ట్ర వైద్యశాఖకు జాతీయ స్థాయిలో రెండు అవార్డులు లభించాయి. పల్లె ప్రజలకు వైద్యసేవలు చేరువచేయడం కోసం నెలకొల్పిన డాక్టర్ వైయ‌స్ఆర్‌ విలేజ్‌ క్లినిక్‌ల నిర్వహణ, వీటిలో టెలీ మెడిసిన్‌ వైద్యసేవలను అమలు చేస్తున్నందుకు గానూ యూనివర్సల్‌ హెల్త్‌ కవరేజ్‌(యూహెచ్‌సీ) డే సందర్భంగా కేంద్ర వైద్యశాఖ ప్రదానం చేస్తున్న అవార్డులకు రాష్ట్రం ఎంపికైంది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో నేడు, రేపు నిర్వహించనున్న యూహెచ్‌సీ డే వేడుకల్లో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, అధికారులు పాల్గొని అవార్డులు స్వీకరించనున్నారు.  

Back to Top